Suryaa.co.in

Andhra Pradesh

రమణ దీక్షితులుపై టీటీడీ వేటు

తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీటీడీ .. దీక్షితులుపై చర్యలు తీసుకుంది. టీటీడీ పాలకమండలి కీలక సమావేశం జరిగింది.

ఇందులో భాగంగా రమణ దీక్షితులుపై వేటు వేస్తూ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణదీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని, ఈ కారణంగా ఆయనను టీటీడీ నుంచి తొలగిస్తూ పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.

LEAVE A RESPONSE