-పేర్ని నాని దొంగ పట్టాలతో బందరు ప్రజల్ని మోసం చేస్తున్నారు
– మీరు ఇచ్చిన పట్టాలు నిజమని ఒక్క ప్రభుత్వాధికారితోనైనా చెప్పించే దమ్ముందా?
– వైసీపీ కార్యాలయంలో ఒరిజినల్ పట్టాలు చూపిస్తున్నారు. ప్రజల్లో దొంగ పట్టాలు పంచుతున్నారు ఇది పచ్చి దగా, మోసం
– కుక్క భాషతో తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శించినంత మాత్రాన మీరు తప్పించుకోలేరు
– నాని మూక కాగ్ ఎత్తి చూపిన అవినీతి గురించి ఎందుకు మాట్లాడడం లేదు?
– వైసీపీ పార్టీ నాయకులు మాజీమంత్రి కొల్లు రవీంద్ర పై చేసిన ఆరోపణలు ఖండిస్తూ మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ ఖాజా, 6 డివిజన్ ఇంచార్జ్ దిలీప్, మాజీ హాస్పిటల్ డైరెక్టర్ అబ్దుల్ అజీమ్
మచిలీపట్నం : ఎన్నికల ముందు పేర్ని నాని తన కొడుకును గెలిపించుకోవడానికి అనువైన అడ్డదారులన్నీ తొక్కుతున్నాడు, అందులో భాగంగానే పేద ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నాడు పట్టాల పేరుతో దొంగ పట్టాలు ఇచ్చి వారిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.పేర్ని నానీ ఇస్తున్న పట్టాలు దొంగ పట్టాలని తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా నిరూపిస్తే దానిని సమర్ధించుకునేందుకు వైసిపి నాయకుల్ని వుసిగొలిపి బూతులు తిట్టిస్తూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
పేర్నినాని ఇచ్చిన పట్టాలు నిజంగా నిజమైతే సంబంధిత అధికారులతో ఎందుకని ప్రకటన చేయించలేకపోతున్నారు, ఎందుకని వైసీపీ నాయకులు అసత్యాలు వాదిస్తున్నారు.పేర్ని నాని ఇచ్చిన పట్టాలు దొంగవని నిరూపించేకి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఏ చర్చకైనా సరే చట్టపరంగా అయినా, ప్రజా క్షేత్రంలో అయిన సరే అని సవాలు చేస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా వైసిపి నాయకులతో బూతులు తిట్టిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు.
మైనార్టీ నాయకుని చేత తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వ్యక్తిగతంగా దూషిస్తూ బూతు పదాలు వాడుతూ ఏరా పోరా అని ఏక వచన సంభాషణలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.పేర్ని నాని ఇచ్చిన దొంగ పట్టాలు పేర్ని నాని కుమారుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంచాలు వేస్తామన్న పదాలను వాడిన విషయాలను ఎత్తి చూపితే సరిచేసుకునేది పోయి తెలుగుదేశం నాయకుల పై వైసీపీ నాయకులు మూకుమ్మడి మాటల దాడి చేయడం ఎంతవరకు సబబు.
మంచాలు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ వాళ్ళన్నారా ? పేర్ని నాని కుమారుడే అభివృద్ధి చేస్తున్న చూడండి వస్తమంటే మంచాలేస్తా అని ఆయనే స్వయంగా అన్న విషయాన్ని పేర్ని నాని సమర్థించుకుంటున్నాడా ఆ భాషను సరి చేసుకోమని సుచించామన్నారు.
పట్టాలు తీసుకున్న ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీ దగ్గర ఉన్న పట్టాలను తీసుకొని ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయంలో ఉన్న జాబితాలో సరిచూసుకోండి మీకు ఇచ్చిన పట్టా నిజమైనదా ? కాదా ? అని మీకే అర్థమయిపోతుంది, ఎవరి నిజాలు చెప్తున్నారు ఎవరి అబద్ధాలు చెబుతున్నారు మీరే నిర్ణయించుకోండి.
పేర్ని నాని మాటలు విని ఈ దొంగ పట్టాలు తీసుకుని మీరు డబ్బు ఖర్చు పెట్టి ఇల్ల నిర్మాణం లాంటివి చేపడితే భవిష్యత్తులో చట్ట పరంగా, ఆర్థికంగా ఇబ్బంది పడి పరిస్థితి ఏర్పడుతుంది. కొల్లు రవీంద్ర అభివృద్ధి మీద ప్రశ్నిస్తే పేర్ని నాని తోకముడిచి పారిపోయి వారి నాయకుల చేత, వ్యక్తిగత దూషణలు చేస్తే కొల్లు రవీంద్ర చేసిన అభివృద్ధి కనిపించకుండా పోతుందా?
పోర్టు విషయంలోనూ హార్బర్ విషయంలోనూ పేర్ని నాని, పేర్ని నాని అన్యాయులు చేస్తున్న అవినీతిని లెక్కలతో సహా బయట పెడితే దానిమీద స్పందించలేక బుఖాయించే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీ గురించి విపరీతమైన ప్రచారం చేస్తున్న పేర్ని నాని మూక కాగ్ ఎత్తి చూపిన అవినీతి గురించి ఎందుకు మాట్లాడడం లేదు దాని మీద ప్రశ్నిస్తే మాటల దాడి చేస్తున్నారు.
కాగ్ స్వయంగా మెడికల్ కాలేజీ నిర్మాణంలో అవినీతి జరిగిందని స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది, అన్ని పత్రికలలో ప్రచురితమైనవి దానిమీద మాట్లాడే దమ్ము ధైర్యం ఈ వైసీపీ మూకకు ఉందా..? కేవలం 30 రోజులు ఎన్నికల నోటిఫికేషన్ ఉండగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు శిలాఫలకాలు అని ప్రచారం చేసుకుంటూ దానినే అభివృద్ధి చేశామని ప్రజల దగ్గర ఊకదంపుడు ఉపన్యాసాలు చేసినంత మాత్రాన ప్రజలు గుర్తించక మానరు మీరు చేసిన అవినీతి అక్రమాల చిట్టా ఏ వ్యక్తిని కదిలించిన అప్రహతితంగా చెబుతారు.
ఇప్పటికైనా మీడియా ముందు వాగడం మానేసి మీరు చేసిన అవినీతి అక్రమాల ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజలకి నిజానిజాలు తెలిపి దమ్ముగా ఓటు అడుక్కునే దమ్ము మీకుందా అని తెదేపా నాయకులు ప్రశ్నించారు. మీరు ఒక మాట మాట్లాడితే రెండు మాటలు మేము మాట్లాడగలం.