(నేడు రామానుజ జయంతి)
అద్వైతమే రామానుజుని అస్థిత్వం
ఆ అద్వైతానికి
తన తత్వం..
మానవత్వం
జోడించి ప్రతిపాదిస్తే
అదే విశిష్టాద్వైతం..
మానవతే దాని మతం..
ప్రపంచానికి అదే అయింది
సమ్మతం..!!
తిరుగులేని కర్తవ్యదీక్ష..
మొక్కవోని ధైర్యం..
దేవునిపై నమ్మకం..
అదే అదే
రామానుజ సిద్ధాంతం..
వేదాంతంలో ఆయన ఆవిష్కరించిన కొత్త కోణం..!
ఆచారాలు పురోగతికి అడ్డుకారాదన్న
రామానుజ సూత్రం..
ఆయన నమ్మిన తారకమంత్రం..
ఒకనాటి ఆచారం ఈనాటి సమాజశ్రేయస్సుకు అడ్డమైనపుడు
అవసరమైతే మార్చేయ్..
లేదంటే తీసెయ్..
ఈ క్రమంలో
ఎంతటి పోరుకైనా
రామానుజ సై సై!
పూజ..తద్వారా మోక్షం..
ఇవి మానవుని హక్కులంటూ ఉద్బోధించిన రామానుజుడు ఇందుకోసం
గురువు చెప్పిందే వేదం
కానేరదన్నాడు..
వితండం కాని నీ తర్కం..
సజ్జనుల సంపర్కం..
నీ విచక్షణ..
అంతిమంగా అదే నీ ఆచరణ
అదే రామానుజ ప్రతిపాదించిన మతస్వాతంత్రం..
భగవానుడే న్యాయనిర్ణేతగా
దుర్నీతిపై తిరుగులేని రణతంత్రం..!
తాను నేర్చిన అష్టాక్షరినే
బహిర్గతం చేసిన ధీశాలి..
తాను నరకానికి పోయినా
పదిమంది స్వర్గానికి చేరుతారని నమ్మిన
హృదయ వైశాలి..
తిరుపతి వెంకన్న స్వరూపాన్నే వాదనతో ఆవిష్కరించిన మేధావి..
వాదనల్లో ఎదుటి మనిషి
మాటను సైతం మన్నించే
మృదుస్వభావి..!
ఎన్నెన్నో ఆలయాల్లో
ఆగమ విధానాల రూపకర్త..
కలియుగంలో
వెలసిన
తొట్టతొలి సంస్కర్త..!
నవమార్గాల సృష్టికర్త
జగతి కొనియాడే యుగకర్త!!
( సమతామూర్తికి ప్రణమిల్లుతూ…)
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286