Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన ఆదర్శ కావ్యం రామాయణం

  • వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నాం
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం
  • మంత్రి . డా డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి

భారతదేశంలో పుట్టిన మహనీయుల్లో వాల్మీకి మహర్షి ఒకరని, ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన ఆదర్శ కావ్యం రామాయణమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. గురువారం నాడు ఒంగోలు కలెక్టరేట్లో వాల్మీకి జయంతి కార్యక్రమంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సంధర్బంగా వాల్మీకి చిత్ర పటానికి పూలమాళలు వేసి నివాళి అర్పించారు.

అనంతరం మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….వాల్మీకి మహర్షి రామాయణంలో కుటుంబ బాంధవ్యాలు, పరిపాలన అంశాలు సమాజానికి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నాం. బీసీల్లోని అన్ని కులాలను అభివృద్ది చేస్తాం. జగన్ 57 బీసీ కార్పోరేషన్లు పెట్టారు తప్ప కనీసం చైర్మన్లు కూర్చోవడానికి కుర్చీలు కూడా ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే చంద్రబాబు లక్ష్యం. అందుకునుగుణంగా నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చాం.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టానికి శ్రీకారం చుట్టాం. బీసీలకు ఎన్డీయే ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్డులకు సౌకర్యాలు కల్పించేందుకు, భవనాలకు మరమ్మతులు చేయించేందుకు స్వచ్చందంగా ముందుకొచ్చి సేవాకార్యక్రమాలు చేసే వారి కోసం స్వీకార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ కి అభినంధనలు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తానని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.

LEAVE A RESPONSE