అది ఒక సామ్రాజ్యం..దాని నిర్మాణానికి దశాబ్దాలు సమయం పట్టింది. గతంలో ఆంగ్లేయులకు పంది మాంసం సప్లై పేరుతో జాతి జనులకు ద్రోహం చెయ్యలేదు. కూలికొచ్చి పాలుకు మాట్లాడలేదు. సంపద కోసం యజమానిని హతమార్చలేదు. తండ్రి పడిగాపులు పడి నీచరాజకీయాలు చేసిచేసి అలిసిపోయే తరుణంలో అందలం చిక్కితే..దాన్నడ్డం పెట్టుకుని పట్టపగలు దోపిడీ చెయ్యలేదు. ఇటుక ఇటుక పేర్చుకుని నిర్మించుకున్నారు. ప్రజల విశ్వాసం..నమ్మకమే పునాది.
కచ్చితత్వం..నిర్భయం..నిర్మొహామాటంతో అక్షర సేద్యం చేసారు..! ఆక్రమంలో ఎందరికో దారి చూపించారు. విశ్వాసం ఘాతుకం..అన్నం తిన్న పళ్ళెం లో ఉమ్మటం చేసే కులకుష్టులు..వికృత మనస్కులు..ఈర్ష్యాద్వేషులు..మలినంలో పొర్లాడే మలినధారులు కక్కిన విషం కక్కకుండా కక్కుతున్నారు.
ఒక్కడు…!ఒక్కడంటే ఒక్కడు..నా సొమ్ము ఎగ్గొట్టాడని ఇంత వరకు అనలేదు.. ఆయన దగ్గర చేసి ఆ విలువతో పైకెదిగిన వారున్నారు. కుట్రలు కుతంత్రాలు.. విద్వేషపూరిత రాతలతో కడుపునింపుకునేవారెందరో..!? ఆయన క్రమశిక్షణ..కచ్చితత్వమే ఆయన విజయరహస్యం. వేలాది మంది కి ఉపాధి కల్పించిన ఆ వ్యక్తి పట్ల విషపు రాతలు జుగుప్స కలిగిస్తున్నాయి.
అచ్చం అదే బుద్ధి కలిగిన నీచులు చప్పట్లు చరుస్తున్నారు. అతడు..మహా సామ్రాజ్యాన్ని నిర్మించాడు.. విశాల వటవృక్షం గా ఎదిగాడు. అనేక మందికి నీడ నిస్తున్నాడు.కడుపు నింపుతున్నాడు. అతని మీద ఉమ్మితే సూర్యుని మీద ఉమ్మినట్టే. మనమూ బతుకుతున్నాము కుక్కలవోలే..పందులవోలె! ఇదీ ఒక బతుకేనా!? ఆ వయోవృద్ధుడ్ని అవమానిస్తున్నామనుకుంటున్నారు. వారు పతనం అంచుకు చేరుకుంటున్నారని గ్రహించలేక పోతున్నారు. కాలం కాచుకున్నది. కాటేయక మానదు. వక్రాచార్యులు వేలమంది ఏకమైనా కాపాడలేరు.
