Suryaa.co.in

Entertainment

రమ్యమైనకృష్ణ..!

కన్నాంబ..
పల్నాటి గడ్డను శాసించిన నాయకురాలు నాగమ్మకు
తొలినాటి రూపం..
భానుమతి..
అదే నాగమ్మకు మరోనాటి
ఉగ్రరూపం..
ఆ ఇద్దరి కలగలుపై..
మాహిష్మతి మేలుకొలుపై..
ఆధునిక భారతంలో
రాచరిక దర్పానికి..
రాణివాస గాంభీర్యానికి..
నిలువెత్తు రూపమై…
నిలిచిన శివగామి..
భారతీయ సినిమాలో
అభినయ అగ్రగామి..
రమ్యకృష్ణ..ఆమె కళాతృష్ణ!

అంతకు కొంచెం మునుపు..
రజనీకాంతునికే మైమరపు..
ఓ మెరుపు..నీలాంబరి..
తలైవాదే అందమైన స్టయిల్..
ఆయనను మించిన పొగరు..
ఎలా ఉంది
నా ఇంటి పనిమనిషి..
అదిగింది సౌందర్య కుశలమా
రమ్యకృష్ణ కౌశలమా..
అతిగా ఆశపడినా..
చరిత్రలో మునుపెన్నడూ లేని అభినయమా..
నరసింహా హిట్టులో
రజనీ..రమ్య ఒకటే అన్నట్టు ద్విపాత్రాభినయమా!

మొదట్లో ఐరన్ లెగ్గు..
అల్లుడుగారు లో మూగనోముతో
ముద్దబంతిపూవై ఒలకబోసిన
అందమైన సిగ్గు..
దర్శకేంద్రుడి హస్తవాసి..
అందుకుంది అందాలరాశి..!
సూపర్ హిట్టులకు ఆహ్వానం..
అల్లరిప్రియుడు కృష్ణవంశీ
అల్లరిమొగుడు గా బృందావనం లో కాపురం..
నాటి నుంచి
హిట్టు మీద హిట్టుతో
దీర్ఘసుమంగళీభవ!!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE