-కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించినందుకు వారి ఆత్మ క్షోభిస్తుంది
– ప్రభుత్వం వల్ల లాభపడిన పారిశ్రామికవేత్త లైన చేనేత కార్మికుల ను చూపించాలి
– నేతన్నలను గోస పెడుతూ కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఉందా.?
– మెగా టెక్స్టైల్ పార్కు ని తెలంగాణ కు కేటాయించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది
– తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ
తొలి దశ తెలంగాణ ఉద్యమ కాలంలో స్వరాష్ట్రం కోసం తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసి ఉద్యమానికి ఊపిరిలూదిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రికి ఎందుకు ముఖం చెల్లలేదు? .జల విహార్ లో ఉన్న తన ఇంటిని టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం ఇచ్చిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ… ఆఖరి రోజుల్లో అనారోగ్యంతో మంచం మీద ఉన్నా చూడడానికి వెళ్ళని మీరు….ఆయన చనిపోతే కూడా వెళ్లి నివాళులు అర్పించని మీరు.. ఈ రోజు కేవలం మునుగోడులో అధిక సంఖ్య లో ఉన్న పద్మ శాలీల ఓట్ల కోసమే బాపూజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన మాట వాస్తవం కాదా…?
నిజంగా మీకు కొండా లక్ష్మణ్ గారి మీద గౌరవం ఉంటే మీ పాలనలో ఉనికి కోల్పోయిన, బాపూజీ పోరాటం చేసి తెచ్చిన చేనేత సహకార సంఘాల ను పునరుద్ధరించండి. అధికారంలోకి వచ్చినాక ఎనిమిదేళ్లుగా గుర్తురాని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ, లాంటి మహనీయులు ఇప్పుడు హడావుడి గా ఎందుకు గుర్తొస్తున్నారు…. మీ నిరంకుశ పరిపాలన పట్ల విసుగుచెంది మిమ్మల్ని ఓడగొట్టాలని నిర్ణయించుకొని ప్రభుత్వం వల్ల లాభపడిన పారిశ్రామికవేత్త లైన చేనేత కార్మికుల ను చూపించాలి. వైపు చూస్తున్న తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికే కదా.
నేతన్నలకు TRS ప్రభుత్వం అండగగా నిలుస్తుందని చెప్తున్నారు.. చేనేత అంటే ఒక సిరిసిల్లనే కనిపిస్తోందా కేటీఆర్ కు. సిరిసిల్ల లో కూడా చేనేత కార్మికులకు బదులు పవర్ లూమ్ లకు ఎందుకు పట్టం కడుతున్నరు. కేటీఆర్ ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో టెక్స్టైల్ పార్కులు మూతపడటం నిజం కాదా. ఇంకా మొదలు పెట్టని కాకతీయ టెక్స్టైల్ కి పార్కుకి రెండు సార్లు శంకుస్థాపనలు చేసి అటకెక్కించి, 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పడం మీ అబద్ధాల దగాకోరు వైఖరికి నిదర్శనం.
వరంగల్ నేత కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి మీరు పిలిస్తే వచ్చి పారిశ్రామికవేత్తలు అయ్యారని దొంగ మాటలు చెప్పిన కేటీఆర్….వరంగల్ రావడానికి బీజేపీ సిద్ధం. నిజాయితీ ఉంటే కేటీఆర్ వచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల లాభపడిన పారిశ్రామికవేత్త లైన చేనేత కార్మికుల ను చూపించాలి. మీరు హామీ నిచ్చిన టెక్స్టైల్ అపెరల్ పాలసీ 2017 నుంచి ఇంకా ఎందుకు అమలుకు నోచుకోలేదు కేటీఆర్… సమాధానం చెప్పాలి.
గద్వాలలో 2018లో కేటీఆర్ శంకుస్థాపన చేసిన పార్కు కు కనీసం డీపీఆర్ కూడా సిద్ధం చేయలేదంటే సిగ్గుచేటు. రాష్ట్రంలో TRS అధికారంలోకి వచ్చిన తర్వాత 360 మంది చేనేత కార్మికుల చావులకు కారణమైన మీరు ఇవాళ మొసలి కన్నీరు కారుస్తున్నారు. నేతన్నలకు నూలు దారం పై సబ్సిడీ ఇస్తూ చేనేత కార్మికులకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది కేంద్రం… రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం సబ్సిడీ ఇవ్వక, మిత్ర పథకం అమలు కాకుండా పేరుకు ఏటా 100 కోట్లు కేటాయిస్తూ చివరకు 11 కోట్లు మాత్రమే ఇచ్చి నేతన్నలను గోస పెడుతూ కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఉందా.?
మొత్తం భారతదేశంలో 7 టెక్స్టైల్ పార్కులను కేటాయిస్తే మెగా టెక్స్టైల్ పార్కు ని తెలంగాణ కు కేటాయించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం కింద సిద్దిపేట, దుబ్బాక, మహదేవపూర్ ,కరీంనగర్ నార్కట్ పల్లి చేనేత క్లస్టర్ ల కు కేంద్రం నిధులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? వాజ్పేయి హయాంలోనే పోచంపల్లి లో కలర్స్ టెక్నాలజీని పోచంపల్లికి అందించిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంది ఆనాడే ఇక్కత్ కు భౌగోళిక హక్కును కల్పించాం …ఈ మధ్యనే పోచంపల్లికి world’s best tourism village గుర్తింపు తీసుకొచ్చాం.
అరబ్ దేశాలకు సైతం ఎనిమిది వేల కోట్ల విలువైన చేనేత వస్త్రాలు ఎగుమతి జరిగిందంటే మోడీ గారి గొప్పతనం కాదా? సిల్క్ సమగ్ర స్కీమ్ -2 కింద తెలంగాణకు ఏడు వందల కోట్లు కేటాయించింది మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, మహాత్మా గాంధీ బంకర్ బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన ద్వారా గత ఎనిమిది ఏళ్లలో రాష్ట్రంలోని 42 వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మందికి ఇన్సూరెన్స్ అందించిన ఘనత నరేంద్ర మోడీ ది.