హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉంది రేవంత్ తీరు
రైతు రుణమాఫీ పై ఎవ్వరూ ఆందోళన చెందొద్దు
ఉమ్మడి పాలమూరు లో ఐదు మెడికల్ కాలేజీ లు రావడానికి కేసీఆర్ కారణం కాదా?
రావుల అజాత శత్రువు కు నిజమైన పర్యాయ పదం
రావుల రాకతో మహబూబ్ నగర్ జిల్లా లో వంద ఏనుగుల బలం
బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు
బీ ఆర్ ఎస్ లో రావుల చంద్రశేఖర్ రెడ్డి చేరిక
మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డికి కండువా కప్పడం నా అదృష్టంగా భావిస్తాను. అజాతశత్రువనే పదానికి ఆయన సరైన నిర్వచనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన రావులను ఆయన కండువాతో సత్కరించి, పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ఏమన్నారంటే… రావుల అజాత శత్రువు కు నిజమైన పర్యాయ పదం. నేను రావుల కు కండువా కప్పి ఆహ్వానించడం నా అదృష్టం గా భావిస్తాను.రావుల ఆయన అనుచరుల రాకతో మహబూబ్ నగర్ జిల్లా లో వంద ఏనుగుల బలం వచ్చింది. రావుల అన్నట్టు రెండు టెర్ము ల కేసీఆర్ పాలన బాగుందని అందరూ ఒప్పుకుంటారు. గతం లో పల్లెలు ఎలా ఉండేవి ఇప్పుడెలా ఉన్నాయి?
అపుడు కరెంటు కోసం పడ్డ తిప్పలు మీ అందరికీ తెలుసు.అసెంబ్లీ కి కరెంటు కోసం కందిలీలతో ఎమ్మెల్యేలు వచ్చి నిరసన తెలిపే వారు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లిఫ్ట్ కాళేశ్వరం కట్టుకున్నాం. కేసీఆర్ తమను కంటికి రెప్పలా కాపాడుకుంటారని రైతులు భావిస్తున్నారు.
రైతుకు పెట్టుబడి సాయం చేయాలన్న ఆలోచన ఈ డెబ్బయ్ యేండ్ల లో కేసీఆర్ కు తప్ప మరొకరికి ఎందుకు రాలేదు? రైతు రుణమాఫీ పై ఎవ్వరూ ఆందోళన చెందొద్దు ..త్వరలోనే పూర్తవుతుంది. రెండు సార్లు రుణ మాఫీ చేసిన ఘనత కేసీఆర్ దే. ఉమ్మడి పాలమూరు లో ఐదు మెడికల్ కాలేజీ లు రావడానికి కేసీఆర్ కారణం కాదా?ప్రభుత్వ విద్యను వైద్యాన్ని పటిష్టం చేసుకున్నాం. పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్టు పథకం విజయవంతంగా అమలవుతోంది.పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం త్వరలోనే పంపిణీ చేస్తాం.
రాహుల్ మమ్మల్ని దొరల పాలన అంటున్నారు.రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి రాచి రంపాన పెట్టారు ..వాళ్ళు కూడా దొరల పాలన అనడమా? కాంగ్రెస్ కు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు ఉందా? డెబ్బయ్ యేండ్లు అధికారం లో ఉండి కాంగ్రెస్ నేతలు ఏం వెలగ బెట్టారు మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని కన్నీళ్లు రెట్టింపు చేశారు.పాలమూరు లిఫ్ట్ లో ఒక్క మోటార్ నడిస్తేనే కాంగ్రెస్ నేతల కండ్లు మండుతున్నాయి ..మొత్తం 31 మోటార్లు నడిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో?
రాష్ట్రంలో సరికొత్త విప్లవం ఆవిష్కృతమైంది.దసరా పండగ రోజూ ఊరూరా చర్చ పెట్టండి.ఇంత అభివృద్ధి గతం లో ఎపుడైనా జరిగిందా చర్చించండి.ప్రభుత్వ ఫలాలు అందని మనిషి రాష్ట్రం లో ఎవ్వరూ లేరు. ఓటేసేప్పుడు అన్నీ ఆలోచించండి.రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అనే అంశం చాలా కీలకమైనది ..ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
రేవంత్ రెడ్డి పుట్టు పూర్వోత్తరాలు పాలమూరు ప్రజలకు తెలుసు.హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉంది రేవంత్ తీరు.మన కంటిని మనమే పొడుచుకోవద్దు. బీ ఆర్ ఎస్ కార్యకర్తలు lic ఏజెంట్లలా ప్రజలను ఒప్పించాలి. ఒక్కొక్క ఓటు పోగు చేసి కేసీఆర్ కు ఓట్ల దీవెన అందించాలి.
ఈ సందర్భంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నారంటే…
దూర ద్రుష్టి గల నేత కే టీ రామారావు.పాలమూరు అభివృద్ధి కోసం ప్రజా సేవ కోసం బీ ఆర్ ఎస్ లో చేరుతున్నా.ఏ పదవిని ఆశించడం లేదు.కేసీఆర్ రెండు టెర్ము ల్లో అభివృద్ధి బాగా జరిగింది.
కేసీఆర్ కు మరోసారి అవకాశ మిస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని బీ ఆర్ ఎస్ లో చేరుతున్నా.బీ ఆర్ ఎస్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా.వినయ విధేయత లతో మేమంతా పని చేస్తాం. మేము అభివృద్ధి లో పోటీ పడతాం నిందల్లో కాదు.