– భగ్నం చేసిన యూపీ పోలీసులు
నోయిడా: నోయిడాలోని రేవ్ పార్టీని పక్కా సమాచారంతో యూపీ పోలీసులు భగ్నం చేశారు. ఆ వివరాలివి. పార్టీకి ఒక్కో అమ్మాయికి రూ. 500, జంటకు 800, అబ్బాయిలకైతే రూ. 1000 ఎంట్రీ ఫీజు. అదుపులోకి 39 మంది. విద్యార్థుల వయసు 16 నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్నట్లు వెల్లడి. నోయిడా, సెక్టార్-39లోని సూపర్‌నోవా రెసిడెన్షియల్ సొసైటీలో శుక్రవారం రాత్రి పార్టీ. పక్కా సమాచారంతో రైడ్ చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు. పార్టీ నుంచి హర్యానా లేబుల్ మద్యం సీసాలు, డ్రగ్స్ స్వాధీనం. విద్యార్థులను వాట్సాప్‌లో పార్టీ కోసం ఆహ్వానించినట్టు విచారణలో వెల్లడి.