– వయనాడ్ లో పీఎం మోదీ
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తు గురైన వయనాడ్ ప్రజల కష్టాల్ని అర్థం చేసుకోగలను… దేశం, కేంద్రం మీ వెనకే ఉంటుంది హామీ ఇస్తున్నా’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇంకా.. ఆయన మాట్లాడుతూ.. విపత్తు మిగిల్చే కన్నీళ్లను స్వయంగా చూశా.. విపత్తు పరిస్థితులు తనకు తెలుసు.
‘ఓ విపత్తును స్వయంగా చూశాను… 45-47 ఏళ్ల క్రితం గుజరాత్లోని మార్బీలో ఓ డ్యామ్ ఉండేది. భారీ వర్షాలతో అది కొట్టుకుపోవడంతో మార్బీ నగరం మొత్తం 10-12 ఫీట్లు నీటితో ముగినింది. 2500 మందికి పైగా చనిపోయారు. వాలంటీరుగా ఆరు నెలలు నేనక్కడే ఉన్నాను. వయనాడ్ విపత్తు సంభవించిన రోజు ఉదయమే కేరళ సీఎం పినరయి విజయన్తో మాట్లాడానని ప్రధాని మోదీ అన్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చానన్నారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ, పోలీసులు, వైద్యులు వీలైనంత వేగంగా బాధితుల వద్దకు చేరుకున్నారని తెలిపారు. నిధుల కొరత కారణంగా పనులు ఆగిపోకుండా కేరళ ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుందన్నారు. బాధిత కుటుంబాలను కలిశానని, విపత్తుతో ప్రజల కలలు శిథిలమైపోయాయని ప్రధాని పేర్కొన్నారు.
Our prayers are with those affected by the landslide in Wayanad. The Centre assures every possible support to aid in relief efforts.https://t.co/3fS83dFmrp
— Narendra Modi (@narendramodi) August 10, 2024