రవిశంకర్ గురూజీ..
ఆర్ట్ ఆఫ్ లివింగ్..
దీన్ని విశ్వవ్యాప్తం చెయ్యడమే ఆయన ఆర్ట్..
రవిశంకర్ గురూజీ..
ఆదివారం పుట్టి
అవతరించాడు రవిగా..
ఆదిశంకరుడు పుట్టిన రోజునే
తానూ పుట్టి
అయ్యాడు శంకర్..
ఆ పేరుకు సార్థకత..
గురుదేవ్ నిబద్ధత..!
మహాత్ముని నేస్తం
సుధాకర్ చతుర్వేది
తొలి గురువుగా..
మహేష్ యోగి
మలి గురువుగా
శాస్త్రం నేర్చిన రవీజీ
తానే గురువై..
సామాజిక సేవల కొలువై..
మన దేశానికే పరువై..
జగతికే చేశాడు మార్గదర్శనం
భారతీయతే నిదర్శనంగా..
భద్రా నదీ తీరాన
నిశ్శబ్ద యోగంతో..
ప్రశాంత యాగంతో
సాధించిన విద్యే
‘సుదర్శనం’గా..!
లయబద్ధమైన శ్వాస..
అందుకోసమే తన ప్రయాస..
నితంతర సాధన..
పద్యంలా..ప్రేరణలా
తాను సాధించిన విద్య
విశ్వ మానవాళికి పంచడమే
రవిశంకర్ అద్భుతమైన ఆర్ట్!
జననం..మరణం..
ఈ రెంటి మధ్య సాగే జీవనం
అందంగా సాగించడం కళ..
దానికి సంప్రదాయం..
నియమ నిష్టలు శాస్త్రీయత జోడిస్తే మరింత సొగసు..
అది గురూజీకి తెలుసు..
తాను నేర్చింది నేర్పించేందుకు
అందమైన భాష..
అది రవిశంకర్ గుండె ఘోష!
చుట్టేస్తూ ధరిత్రి…
సాధిస్తూ దేశాల
నడుమ మైత్రి
ఈ గురుదేవుడు అయ్యాడు
ప్రపంచ శాంతి రాయబారి…
మ్రోగిస్తూ ఆధ్యాత్మికభేరి..!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286