Suryaa.co.in

Andhra Pradesh

మూర్ఖత్వం, అజ్ఞానంతో జగన్ విధ్వంసానికి రాయలసీమ బలైంది

సీమలో 102, అనంతపురంలో 38 ప్రాజెక్టుల్ని రద్దు చేసిన జగన్
కొత్త ప్రాజెక్టుల పేరుతో రూ.600 కోట్లు దోచుకున్న మంత్రి పెద్దిరెడ్డి
గోదావరి నీటిని బనకచర్లకు తీసుకొచ్చి సీమను సస్యశ్యామలం చేయడమే నా జీవితాశయం
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా
అనంతపురం జిల్లా ప్రాజెక్టులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి పవర్ పాయింట్ ప్రజంటేషన్

ఒక వ్యక్తి చేసిన విధ్వంసం ప్రజలకు తెలియచేయడానికే ప్రాజెక్టుల సందర్శనకు సిద్ధమయ్యాను. ఏ ప్రాంతానికి ఎవరు న్యాయంచేశారు.. ఎవరు దగా చేశారనే వాస్తవం కూడా ప్రజలు తెలుసుకోవాలి. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం గురించి ప్రజలతో పాటు రైతులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, మేథావులకు తెలియాలి.

ఒకప్పుడు అనంతపురం అంటే క్లాక్ టవర్ బొమ్మ పెట్టేవాళ్లం. ఇప్పుడు కియా పరిశ్రమ బొమ్మ పెట్టుకుంటున్నాం. ఒక మూర్ఖుడు, ఒక అజ్ఞాని, మతిస్థిమితం లేని వ్యక్తి రాష్ట్రానికి ఎంత చేటు చేస్తాడో అందరూ గ్రహించాలి. జరిగే అన్యాయానికి అందరూ సాక్షులే. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంతో కలిగే ప్రయోజనాలు అందరూ తెలుసుకోవాలి. సంపద సృష్టికి నీరు, రోడ్లే కీలకం.

పట్టిసీమ వల్లనే అనంతపురానికి నీళ్లివ్వగలిగాం
ఉమ్మడి రాష్ట్రంలో బాగా వెనుకబడిన జిల్లాలు అనంతపురం మహాబూబ్ నగర్. అనంతపురానికి నీళ్లు వచ్చాక బాగుపడింది. మహాబూబ్ నగర్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. 120 టీఎంసీల గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు తరలించాం. శ్రీశైలంలో మిగిలిన నీటిని హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు అందించాం.

అనంతపురానికి ఇప్పుడు వచ్చే నీరు పట్టిసీమ వల్ల వచ్చినవే. ఈ సంవత్సరం వర్షాలు లేకపోయినా ఈప్రభుత్వం పట్టిసీమ పంపులు ఆన్ చేయలేదు. హంద్రీనీవా పంపులు ఆన్ చేయలేదు. శ్రీశైలం నుంచి నీటిని రాయలసీమకు తరలించవచ్చని చెప్పింది ఎన్టీఆర్. గోదావరి నీటిని రాయలసీమకు తీసుకురావచ్చని చెప్పి, చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ.

సాగు నీటి రంగానికి అధికంగా ఖర్చు చేసింది టీడీపీనే
2014-19 మధ్య టీడీపీప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.68,293కోట్లు ఖర్చుపెడితే, ఇతను వచ్చాక 2019-23 మధ్య రూ.22165 కోట్లు పెట్టాడు. మొత్తం బడ్జెట్లో సాగునీటిరంగానికి టీడీపీ రూ.9.63శాతం నిధులు కేటాయిస్తే, ఈ ప్రభుత్వం కేవలం 2.35శాతం కేటాయించింది. రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12,441కోట్లు ఖర్చుపెడితే, ఇతను నాలుగేళ్లలో రూ.2011 కోట్లతో సరిపెట్టాడు. దూరదృష్టి, అవగాహనలేకుండా పనులు చేస్తే ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి.

అనంతపురం జిల్లాలో అతితక్కువ వర్షపాతం ఉంటుంది. సగటు వర్షపాతం కేవలం 552 మిల్లీమీటర్లు. ప్రధాన పంట వేరుశనగ. జిల్లాలో పెన్నా, జయమంగళి, చిత్రావతి, వేదవతి, పాపాగ్ని, మద్దిలేరు నదులు ఉన్నాయి. సాగు మొత్తం కృష్ణా, పెన్నా బేసిన్ పైనే ఆధారపడి ఉంది. మొత్తం భూమి 47.20 లక్షల ఎకరాలైతే, సాగుభూమి 11.79 లక్షల ఎకరాలు. నీటి సదుపాయం ఉన్నది కేవలం 1.39 లక్షల ఎకరాలకే. అదే మొత్తం భూమికి నీరు అందితే ఉమ్మడి అనంతపురం హార్టీకల్చర్ హబ్ గా మారుతుంది.

ప్రాజెక్టుల వారీగా…
హంద్రీనీవాలో అంతర్భాగమైన మారాల రిజర్వాయర్ :
మొత్తం ఆయకట్టు 18వేల ఎకరాలు. తాగునీరు అందించవచ్చు. టీడీపీప్రభుత్వం రూ.89.22కోట్లతో మొత్తం ప్రాజెక్ట్ పూర్తిచేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క కాలువ తీయలేదు. రిజర్వాయర్లో నీళ్లున్నాయి..కానీ రైతులకు అందించలేదు.

చెర్లోపల్లి రిజర్వాయర్ :

మొత్తం ఆయకట్టు 5,500ఎకరాలు. 29-01-2019న టీడీపీప్రభుత్వం ప్రారంభించింది. హెచ్.ఎన్.ఎస్.ఎస్ ప్రధాన కాలువ నుంచి వెళ్లే పుంగనూరు ఉపకాలువ 23కిలోమీటర్ల వద్ద 1.60టీఎంసీల సామర్థ్యంతో చేపట్ట బడింది. రూ.88కోట్లు ఖర్చుపెట్టి, టీడీపీప్రభుత్వం నిర్మించింది. వైసీపీ వచ్చాక రిజర్వాయర్ నిర్వహణను గాలికి వదిలేసి, టీడీపీ వేసిన శిలాఫలకాలు ధ్వంసం చేసింది.

మడకశిర బ్రాంచ్ కెనాల్ :

మొత్తం ఆయకట్టు 10వేల ఎకరాలు. 32,772 ఎకరాల స్థిరీకరణ. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువనుంచి 173కిలోమీ టర్ల పొడవుగల కాలువద్వారా 5 టీఎంసీల నీటిని 265 చెరువులకు పంపవచ్చు. దీనివల్ల హిందుపూరం, మడకశిర నియోజకవర్గాల్లో 10మండలాలకు లబ్ధి కలుగుతుంది. రూ.805కోట్లు ఖర్చుపెట్టి, టీడీపీప్రభుత్వం దాదాపుగా పనులు పూర్తిచేసింది. వైసీపీ వచ్చాక గత నాలుగేళ్లుగా ఒక్క అడుగుపని జరగలేదు. చివరకు పూడిక తీయకుండా వదిలేశారు. పూడికతీతకు రూ.89కోట్లు ఖర్చు పెట్టి ఉంటే, 265 చెరువులకు నీళ్లు అందేవి.

గొల్లపల్లి రిజర్వాయర్ :

మొత్తం ఆయకట్టు 4,000 ఎకరాలు. మడకశిర బ్రాంచ్ కెనాల్ పై గొల్లపల్లి వద్ద నిర్మించిన జలాశయం. నీటినిల్వ సామర్థ్యం 1.61టీఎంసీ లు. టీడీపీప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసింది. దీనివల్లే కియా మోటార్స్ వచ్చింది. 6నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తిచేసి, కియా పరిశ్రమ వచ్చేలా చేశాం. కియాపరిశ్రమకు నీరు అందించడంతోపాటు, హిందూపురం, మడకశిర పట్టణాలకు తాగునీరు అందించాం.

గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ :

మొత్తం ఆయకట్టు 15,800 ఎకరాలు. టీ.హెచ్.బీ .హెచ్.ఎల్.సీ నుంచి ఉరవకొండ నింబగల్లు సమీపంలో గుంతకల్లు దిశగా 59.5 కిలోమీటర్ల పొడువు. మొత్తం అంచనావ్యయం రూ.238కోట్లు. (2 ప్యాకేజీలు) టీడీపీప్రభుత్వంలో రూ.117కోట్లు ఖర్చుపెట్టి, ఫేజ్-2 ఆధునికీకరణ పనులు చేప ట్టాం. వైసీపీవచ్చాక శిథిలావస్థకు చేరింది. అండర్ టన్నెల్స్ మరమ్మతు చేయక పోవడంతో నీరు లీకవుతోంది. దానివల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ :

మొత్తం ఆయకట్టు 3.45 లక్షల ఎకరాలు. టీడీపీ హాయాంలో రూ.4,182కోట్లు ఖర్చుపెట్టాం. వైసీపీప్రభుత్వం కేవలం రూ.515కోట్లు వెచ్చించింది. టీడీపీహాయాంలో రూ.1030కోట్లతో ప్రధాన కాలువపనులు 50శాతం పైగా పూర్తిచేశాం. హంద్రీనీవా నుంచి జీడిపల్లికి నీళ్లు తరలించే ప్రధాన కాలువసామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కులకు పెంచుతామన్న హామీని జగన్ విస్మరించాడు. రూ.6,182కోట్లకు జీవో ఇచ్చి, టెండర్లు పిలవకుం డా పనులు గాలికి వదిలేశాడు. కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక పోయేలా చేశాడు.

జీడిపల్లి – భైరవానితిప్ప లిఫ్ట్ :

మొత్తం ఆయకట్టు 22,323 ఎకరాలు. 114 చెరువులకు నీరు అందించవచ్చు.టీడీపీ ప్రభుత్వం రూ.987.87కోట్లు ఖర్చుపె ట్టింది.18కిలోమీటర్ల కాలువ తవ్వింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క అడుగు పని జరగలేదు. భూసేకరణ హమీని నెరవేర్చలేదు.

జీడిపల్లి – పేరూరు :

మొత్తం ఆయకట్టు 25వేల ఎకరాలు. ప్రాజెక్ట్ విలువ రూ.804కోట్లు. టీడీపీప్రభుత్వం రూ. 60 కోట్లు ఖర్చుపెట్టింది. సోమవాండ్ల పల్లె, పుట్టకనుమ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో పాటు, 37కిలోమీటర్ల కాలువ తీయాల్సి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక పుట్టకనుమ రిజర్వాయర్ రద్దుచేసింది. భూసే కరణ చేసిన 961 ఎకరాల్ని రద్దుచేసింది. కొత్తగా ముట్టాల తోపుదుర్తి ప్రతిపాదన పెట్టింది కానీ పనులు మాత్రం జరగడంలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం పరిటాల సునీత ఎంతో కృషిచేసింది.

అనంతపురం జిల్లా సూక్ష్మసహకార సేద్యం :

రూ.890.60 కోట్లతో జిల్లాలో సహకార సూక్ష్మ సేద్యాన్ని ప్రారంభిం చాం. నీటిని సమర్థవంతంగా ఉపయోగించు కోవడానికి మైక్రోఇరిగేషన్ కు టీడీపీప్రభుత్వం ఆర్థికసాయం చేసింది. 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ పద్ధతిని ప్రోత్సహించాం. మిడ్ పెన్నార్, పీఏబీ ఆర్, జీడిపల్లి రిజర్వాయర్ల ద్వారా 50వేల ఎకరాలకు 2 టీఎంసీల నీటిని డ్రిప్ ఇరిగేషన్ కోసం సరఫరా చేయాలని భావించాం. ఇది పూర్తయి ఉంటే, జిల్లా రైతాంగానికి ఇబ్బందే ఉండేదికాదు. వైసీపీప్రభుత్వం వచ్చాక మొత్తం ప్రాజెక్ట్ నే పక్కన పెట్టే సింది.

ఉరవకొండ బిందుసేద్యం :

ఇది కూడా సూక్ష్మసహాకార సేద్యంలో అంతర్భాగం. దీనికి కావాల్సిన నీరు 1.90 టీఎంసీలు. 23 గ్రామాలకు లబ్ధికలిగే ప్రాజెక్ట్ కి టీడీపీహాయాంలో రూ.100కోట్లుఖర్చు పెట్టాం. వైసీపీ వచ్చాక టీడీపీ ప్రభుత్వం సమకూర్చిన బిందుసేద్యం పరికరాలు, పైపుల్ని గుట్టలుగా పడేసి, పనికిరాకుండా చేసింది.

గోదావరి–కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం :

గోదావరి నీరు కృష్ణానది మీదు గా బనకచర్లకు తీసుకొచ్చేలా ప్రణాళికలు వేశాం. ముచ్చుమర్రి నుంచి కే.సీ.కెనాల్ మీదుగా బనకచర్లకు అక్కడినుంచి హంద్రీ నీవాకు, అక్కడి నుంచి పైకితీసుకెళ్తే తెలుగుగంగకు, కిందికి తీసుకెళ్తే గాలేరు-నగరికి వెళ్తాయి. రాయలసీమకు గుండెకాయ బనకచర్ల ప్రాజెక్ట్. పట్టిసీమ కాకుం డా గోదావరి నీరు నేరుగా వైకుంఠపురం బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ ప్రధాన కుడికాలువకు తీసుకెళ్లడం ద్వారా 130 టీఎంసీలు, చింతలపూడి లిఫ్ట్ ద్వారా 30 టీఎంసీలు, పట్టిసీమ నుంచి 120టీఎంసీలు కలిపి, మొత్తంగా 280 టీఎంసీల నీ రు శ్రీశైలనుంచి నేరుగా రాయలసీమకు తరలించే అవకాశముంది. నేను ప్రారంభించిన వైకుంఠపురం బ్యారేజ్ పనులు ఆపేశారు. దాంతో అనుకున్నది నెరవేరక సీమకు అన్యాయం జరిగింది.

భవిష్యత్ లో మరో ఆలోచన ఉంది. నాగార్జునసాగర్ సమీపంలోని బొల్లాపల్లికి గోదావరి నీటిని తరలించి, అక్కడొక రిజర్వాయర్ కట్టి, నేరుగా ఆ నీటిని నల్లమల అటవీప్రాంతం నుంచి బనకచర్లకు తీసుకురావచ్చు. గోదావరి నీరు రాయలసీమ కు వస్తే ఒక్కఎకరా ఎండదు. గోదావరి నీళ్లు సీమకు తరలించడమే నా జీవి తాశయం. ఇది జరిగితే నిజంగా రాయలసీమ రతనాలసీమ అవుతుంది.
సీమలో 102, అనంతపురంలో 38ప్రాజెక్టుల్ని జగన్ రద్దుచేశాడు..

మనం ఒకటి అనుకుంటే ఈ ముఖ్యమంత్రి దానికి పూర్తి విరుద్ధంగా ఆలోచిస్తాడు. అదే సైకోతనం అంటే. అధికారంలోకి వస్తూనే 365 జీవో తీసుకొచ్చి, రాష్ట్రంలో మొత్తం 198 సాగునీటి ప్రాజెక్టుల్ని ప్రీక్లోజర్ (రద్దు) చేశాడు. రాయలసీమలో 102 ప్రాజెక్టుల్ని ప్రీక్లోజర్ చేశాడు. అనంతపురం జిల్లాలో 38 ప్రాజెక్టుల్ని రద్దుచేశాడు. ఐదేళ్లపాటు మరలా ఎవరూ టెండర్లు పిలవకూడదన్నాడు.

ఏమంటారు దీన్ని? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టుల్ని కొన సాగించాను. రద్దుచేస్తే నష్టంవస్తుందని, కాంట్రాక్టర్లను ఒప్పించిపనులు చేయించాను.
మంత్రి పెద్దిరెడ్డికి దోచిపెట్టడానికే..

జగన్ రెడ్డి వచ్చాక సాగునీటిప్రాజెక్టుల ముసుగులో కొత్తతరహా దోపిడీకి తెరలే పాడు. గతంలో ప్రారంభించిన పనులు, నిర్మాణంలోని ప్రాజెక్టుల్ని కాదని, రాయలసీమ కరువునివారణ ప్రాజెక్టుల పేరుతో రూ.12వేలకోట్లతో 10ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తున్నామని హడావిడి చేశాడు. గండికోట నుంచి టీడీపీహాయాంలోనే పులివెందులకు నీళ్లు ఇచ్చాం. దీనిలో భాగంగా రూ.3556కోట్లు ఖర్చుపెట్టి పను లు చేస్తున్నట్టు నమ్మించారు.

ఎక్కడా ఏమీ జరగలేదు. రూ.10కోట్లతో తూతూ మంత్రంగా పనులుచేసి వదిలేశారు. అదలాఉంటే, మరో రూ.5,036కోట్లతో మంత్రి పెద్దిరెడ్డికి పనులు అప్పగించాడు. నీళ్లులేని ప్రాజెక్టులో పనులకోసం రూ.5036 కోట్లు ఖర్చుచేయడం కేవలం పెద్దిరెడ్డికి దోచిపెట్టడానికే. హంద్రీనీవాను కుప్పం, చిత్తూరు వరకునిర్మాణంలో ఉన్న కాలువపనులు ముందుకు తీసుకెళ్లకుండా, మరోకాలువ తవ్వడంకోసం ఇలా ప్రజల సొమ్ముని దోచేస్తారా? దీనికి సంబంధించి ఇప్పటికే పెద్దిరెడ్డికి రూ.600 కోట్లు దోచిపెట్టారు. ఇతర కాంట్రాక్టర్లు ఎవరికీ రూపా యిఇవ్వలేదు. శ్రీశైలం వద్ద రాయలసీమ లిఫ్ట్ అని పెట్టి, దానికి రూ.900 కోట్లు కట్టబెట్టేశారు. ఈ విధంగా అడ్డగోలుగా దోచేసే ప్రతిపనికి భవిష్యత్ లో మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నా.

కియాపై జగన్ పిట్టకథలు:-

‘కియా’పై జగన్ కథలు… కియా మోటార్స్ తయారుచేసే కారు దేశంలోనే మో స్ట్ పాపులర్ కార్ గా నిలిచింది. అంతగొప్ప పరిశ్రమరావడం వల్ల అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోయాయి. దీనిపై ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏం చెప్పాడు? రాజశేఖర్ రెడ్డికి కలవస్తే రాష్ట్రానికి కియా వచ్చిందని. ఇలాంటి కట్టు కథలు.. పిట్టకథలతో ఎన్నాళ్లు ప్రజల్ని నమ్మిస్తారు?
వైసీపీ ఎంపీ కియా యాజమాన్యాన్ని ఎలా బెదిరించాడో అందరం చూశాం. మోడల్ ఆఫ్ డెవలప్ మెంట్ కు నిలువెత్తు నిదర్శనం కియా. అలాంటి ప్రాజెక్ట్ ను డబ్బులకోసం బెదిరిస్తారా? గోదావరి నీటిని బనకచర్లకు తీసుకొచ్చి, రాయలసీమను సస్యశ్యామలం చేయడ మే నా జీవితాశయం.. చేసి చూపిస్తా ను. రాయలసీమకు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలతోపాటు పోర్టుల్ని అనుసంధానిస్తే, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు పుంజుకుంటాయి.”

 

LEAVE A RESPONSE