Suryaa.co.in

Andhra Pradesh

రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి

-మంత్రాలయంలో వలసలకు అడ్డుకట్ట వేస్తాం
-సూపర్ సిక్స్ – సక్సెస్ – జగన్ రెడ్డి మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్
-బోయ, కురబ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది టిడిపినే
-జగన్ ప్యాలెస్ కొల్లగొట్టి పేదల పొట్ట నింపడమే క్లాస్ వార్
-రాజకీయ పిచ్చితో గత నెలలో 33 మంది పింఛన్ దారులను పొట్టన పెట్టుకున్న జగన్
-రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసే బాధ్యత నాది
-మంత్రాలయం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

మంత్రాలయంలో మార్పు వస్తుంది. మంత్రాలయం నియోజకవర్గానికి రాబోయేవి అన్ని మంచి రోజులే. అది మీ అందరికి నా భరోసా. గురురాఘవేంధ్ర స్వామి ఆశీస్సులతో రాష్ట్రానికి మంచి జరగాలి. ఖాధర్ లింగ స్వామి, ఉరకొండ ఈరన్న స్వామి ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలి. గతంలో ఆ దేవాలయానికి రూ.8.50 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేశాం. రేపు జరిగే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారు.

మన మీటింగ్ లు గలగల జగన్ మీటింగ్ లు వెలవెల. దీనిని బట్టి గెలుపు కూటమిదే అని అర్ధమౌతుంది. కురవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అభ్యర్ధిగా అవకాశం కల్పించాం. అదే విధంగా మంత్రాలయానికి బోయ వర్గానికి చెందిన రాఘవేంద్రరెడ్డిని ప్రోత్సహించాం. నాకు మంచి మిత్రుడు, పార్టీకి బాగా పని చేసిన వ్యక్తి తిక్కారెడ్డి. జగన్ రెడ్డివి అన్ని మోసాలే. మన సామాజిక న్యాయం మీరు చూస్తే పార్లమెంట్ కు కురవ అభ్యర్ధి నాగరాజుకు ఇచ్చాం. అదే విధంగా ఎక్కువగా బోయ వర్గం ఎక్కువగా ఉన్నందున రాఘవరెడ్డికి ఇచ్చాం.

ఆదోనిలో డెంటల్ పార్ధసారధికి ఇచ్చాం. ఆలూరులో లింగాయత్ వర్గానికి చెందిన వ్యక్తిని అభ్యర్ధిగా నిలబెట్టాం. కుడమూరులో ఎస్సీ మాదిగకు ఇచ్చాం. పత్తిపాడు ఈడిగ వర్గానికి చెందన వ్యక్తికి ఇచ్చాం. కర్నూలులో వైశ్యలకు ఇచ్చాం. నంద్యాలలో ముస్లిం వర్గానికి చెందిన ఫరూక్ కి ఇచ్చాం. ఇదే నిజమైన సామాజిక న్యాయం. అదే వైసీపీలో ముగ్గురు రెడ్లకు ఇచ్చారు. ఆదోని, మంత్రాలయాలను ఇద్దరు అన్నదమ్ములు దోచుకుంటున్నారు. ఓట్లు మీవి దోపిడి వీళ్లవి. వాళ్ల పొట్టలు పెరిగిపోయాయి, మీ పొట్టలు కరిగిపోయాయి.

కూటమితోనే మంత్రాలయం అభివృద్ధి సాధ్యం

ఒక సాధారణ ఎంపీటీసీ అభ్యర్ధి నాగరాజును ఎంపీ అభ్యర్ధిగా నిలబెట్టాం. పార్లమెంట్ మనమే గెలువబోతున్నాం. పేద వాళ్లకు సీట్లు ఇచ్చి సామాజిక వర్గాలను ఆదుకున్నారని ప్రతి ఊరులోను చర్చ జరగాలి. పక్కనే తుంగభద్ర ఉన్నా తాగటానికి నీళ్లు లేవు. గురురాఘేవంద్ర ఎత్తిపోతల పని చేస్తుందా? కాని ఆ ఏట్లో ఉండే ఇసుక మాఫియా జరుగుతుంది. మీ నదిలో ఇసుకుంటే దొంగిలిచ్చ్ బాలనాగిరెడ్డి ఏ రోజైనా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా? రోడ్లు ఒక్క కి.మీ. వేశారు. ఒక్కరికి ఉద్యోగం ఇప్పించారా?

బడుగు జీవుల రక్తం తాగే దుర్మార్గులు బాలనాగిరెడ్డి, సాయిప్రతాప్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యేలు. బీజేపీ నాయకులు రామకృష్ణ, జేఎస్పీ నాయకులు రామాంజనేయులు, జనసేన ఇంచార్జ్ లక్ష్మన్న, బీజేపీ ఇంచార్జ్ విష్ణువర్థన్ రెడ్డి, ప్రాణసమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులు, మరో వైపు జన సైనికులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కూటమితోనే మంత్రాలయం అభివృద్ధి అవుతుంది. ఈముఖ్యమంత్రి ఒక సైకోని నమ్ముకొని అందరూ మునిగిపోయారు.

పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసే బాధ్యత కూటమిది

ఐదేళ్ల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా? రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయి. మోసాలు, అబద్దాలు చెప్పి ఓట్లు దండుకున్నారు. పాదయాత్రలో నెత్తిన చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టడంతో మీరు కరిగిపోయారు. ఉగ్రవాది నాటకానికి ప్రజానీకం కరిగిపోయారు. ఈ ప్రాంతానికి అన్ని సీట్లు వైసీపీని గెలిపించారు. మా కౌతాలానికి ఒక్క పని చేశావా? మా కర్నూలు, మా రాయలసీమకు ఒక్క పని చేశావా అని అడుగుతున్నాను. జగన్ రెడ్డికి నీటి విలువ తెలుసా?

సాగు, తాగు నీరు ఎక్కడుంటే అక్కడ ప్రజల సుఖసంతోషాలతో ఉంటారు. వ్యవసాయం, కాలేజీలు, స్కూళ్లు అన్ని బాగుంటారు. ఈ ప్రాంతంలో నీళ్లు లేక 80వేల మంది వేరే ప్రాంతాలకు వలసపోతున్నారు. కౌతాలం నుంచి వలస పోకుండా వేరే ప్రాంతం నుంచి ఇక్కడకి వచ్చేలా చేయడమే నా ప్రాధాన్యత. రాయలసీమలో 102 ఇరిగేషన్ ప్రాజెక్టులను రద్దు చేశారు. రాజోలు బండ డైవర్షన్ స్కీంకి రూ.1,955 కోట్లు ఇస్తే ఖర్చు పెట్టకుండా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. వేదావతి ఎత్తిపోతలకు జీవో నెం. 77 ద్వారా రూ.1,942 కోట్లు ఇస్తే పంపు హౌస్, కెనాల్ పనులను నిలిపివేశారు. గుండ్రేవుల ప్రాజెక్టు 2015లో డీపీఆర్ సిద్ధం చేసి కొడుమూరులో ప్రారంభిస్తే నిలిపివేశారు.

గురురాఘవేంద్ర ప్రాజెక్టును గాలికి వదిలిపెట్టారు. 12 లిఫ్ట్ లను పట్టించుకోలేదు. పులికనుమను టిడిపి ప్రారంభించింది. కుమ్మలూరు లిఫ్ట్, వల్లూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లు పూర్తి చేస్తే జగన్ నిలిపివేశారు. 90 శాతం డ్రిప్ ఇరిగేషన్ తో పరికరాలు ఇస్తే జగన్ వాటన్నింటిని రద్దు చేశారు. ప్రజలకు న్యాయం చేయాలని మేం చూస్తే జగన్ రెడ్డి విధ్వంసంతో చీకటి రోజులుగా మార్చారు. సైకో పోతేనే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయి. రూ.10 ఇచ్చి రూ.100 భారం వేసి రూ.1000 దోచారు. ఈ రాష్ట్రంలో ఒక్క సైకో దగ్గరే డబ్బులు ఉన్నాయి. జగన్ ప్యాలెస్ కొల్లగొట్టి పేదల పొట్టి నింపడమే క్లాస్ వార్.

దేశంలో ఎక్కడా లేని విధంగా నాశిరకం మద్యం బ్రాండ్లు

బాధుడే బాధుడులో కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారు. గతంలో రూ.200 కరెంట్ ఛార్జీ రూ.1000 అయ్యింది. నేను అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెరగవు. మీ ఊరికి కావాల్సిన కరెంట్ మీ ఊరులోనే తయారు చేస్తాం. పెట్రోల్ డిజిల్ ధరలు పెరిగాయి. గతంలో క్వార్టర్ బాటిల్ రూ.60 ఇప్పుడు రూ.200కి పెంచారు. అంటే రూ.140 డబ్బులు సైకో జేబులోకి వెళ్లాయి. పేద వాళ్లను నిరుపేదలను చేశారు. పేదవాళ్ల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. ఆడబిడ్డల మాంగళ్యాలను తెంచేతున్నారు. అందుకే పక్కనే కర్నాటకకు వెళ్లి క్వార్టర్ కొనుకొని, పెట్రోల్ డిజిల్ అక్కడే కొట్టించుకున్నారు.

బూం బూం, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్ అంటూ నాశిరకం మద్యాన్ని తీసుకువచ్చారు. ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక ఉచితంగా వచ్చేది కాని నేడు రూ.5వేలకు పెంచారు. ఎవడికైనా ఉద్యోగం వచ్చిందా? డీఎస్సీ పెడతాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా జే బ్రాండ్స్, డ్రగ్స్ ఇచ్చాడు. మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే పెడతాను. జాబ్ క్యాలెండర్, పోలీస్ ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల ఉద్యోగాలు ఐదేళ్లల్లో ఇస్తాం. ఇంటింటికి కుళాయి ద్వారా తాగు నీరు అందిస్తాం.

రూ.1,400 కోట్లు మంజూరు చేస్తే అటకెక్కించారు. నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. జగన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్. యువత సైకిల్ ఎక్కి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు పట్టుకొని ఊరూరు వెళ్లి ప్రజలను ఛైతన్యవంతులుగా తీర్చిదిద్దండి. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేది సైకిల్. అంగన్ వాడీ, హోంగార్డులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షనర్లకు న్యాయం చేస్తాం. రోడ్లని బాగు చేసే బాధ్యత నాది. రోడ్లు అధ్వానంగా మారిపోయాయి.

జగన్ రాజకీయ పిచ్చితో పింఛన్ దారులను ఇబ్బందులు పెట్టవద్దు

సూపర్ సిక్స్ తో మీ ముందుకు వచ్చాను. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్. జగన్ రెడ్డి నవరత్నాలు నవమోసాలు. జగన్ మేనిఫెస్టోకి జీరో మార్కులు వస్తాయి. ఒక్క హామీని పూర్తి చేయలేదు. ప్రజల జీవనం కోసం భయటకు వెళుతున్నారు. ఈ ప్రాంతంలో నీళ్లు లేక పెళ్లిళ్లు, పండుగలు కూడా చేసుకోలేకపోతున్నారు. టెక్నాలజీ యుగంలో నీళ్లు లేవంటే గుండె తరక్కుపోతుంది. అందుకే సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డలకు మహాశక్తి కింద నాలుగు కార్యక్రమాలు అమలు చేస్తాం. డ్వాక్రా సంఘాలు, కాలేజీల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లను టిడిపి తెచ్చింది.

ఆడబిడ్డ నిధి కింద ఒక్కో ఆడబిడ్డకు రూ.1,500 ఇస్తాం. తల్లికి వందనం కింద పిల్లల చదువులు నిమిత్తం ఒక్కో పిల్లవాడికి రూ.15,000 ఇస్తాం. ఎంత మంది ఉంటే అందరికి ఇస్తాం. అందరిని చదివించే బాధ్యత నాది కూటమికి ఓట్లు వేసేబాధ్యత మీది. దీపం పథకాన్ని తెచ్చాం.3 సిలెండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్ర ప్రగతితో పాటు ఆడబిడ్డల భవిష్యత్ కూడా కాపాడతాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. పేదరికం లేని సమాజం చూడాలనేదే నాధ్యేయం.

సంపద సృష్టించి ఆదాయం పెంచి దానిని ప్రజలకు పంచుతాను. ఆడబిడ్డలను లక్షాదికారులుగా చేసే బాధ్యత నాది. సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. వ్యవసాయాన్ని ఆదుకుంటాం. రైతుకు రూ.20వేలు ఇచ్చే బాధ్యత మాది. జగన్ రెడ్డి ఏం చేయలేక స్టిక్కర్ ఆటలాడుతున్నారు. రైతు కూలీలను ఆదుకుంటాను. ప్రతి ఒక్క పేదవాడికి రెండు, మూడు సెంట్లు ఇంటి జాగా ఇస్తాను. సైకో ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేయను. కేంద్రం 5 కేజీల బియ్యం ఇస్తుంది. అంతే కాకుండా గతంలో కందిపప్పు ఇచ్చేవాళ్లం ఇప్పుడు వస్తున్నాయా?

అంతేకాకుండా 8 రకాల వస్తువులు ఇచ్చేవాళ్లం ఇప్పుడు వస్తున్నాయా? అన్న క్యాంటీన్లు రద్దు చేశాడు. అందరికి పింఛన్లు ఇస్తాం. పింఛన్లు ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. రూ.200 నుంచి రూ.2000 పెంచాం. జూన్ 04న ఎన్నికల ఫలితాలు వస్తాయి కాని ఏప్రిల్ నుంచే రూ.4వేలు ఇచ్చే పూచి నాది. జగన్ రెడ్డి రాజకీయ పిచ్చితో పించన్ల పేరుతో గత నెలలో 33 మంది వృద్ధులను చంపేశారు. పేద వాళ్ల జీవితాలతో ఆడుకోవద్దు.

కౌతాలంలో 100 పడకల ఆసుపత్రి కట్టిస్తాం

ఉగాది రోజున అమరావతిలో మూడు ట్రాక్టర్ల్లో మంత్రాలయం నుంచి వలస వచ్చారు. నా మనస్సు కరిగిపోయింది. మొదటి ప్రాధాన్యత కౌతాలానికి ఇచ్చి సమస్యలను పరిష్కారం చేస్తాను. గురురాఘవేంద్ర 9 ఎత్తిపోతలను బాగు చేస్తాం. రూ.1,400 కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్టును పూర్తి చేస్తాం. కౌతాలంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాం. నీరు, విద్య, ఆరోగ్యం, ఉపాధితో పేదరికం నిర్మూలనే ధ్యేయంగా పని చేస్తాను. 175 అసెంబ్లీలో, 25 పార్లమెంట్ లో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పని చేయాలి.

LEAVE A RESPONSE