Home » పిఠాపురం ప్రచారంలో పద్మ

పిఠాపురం ప్రచారంలో పద్మ

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు సతీమణి పద్మ ఆదివారం ప్రచారంలో పాల్గొన్నారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనిలోని 22, 23, 27 వార్డులలో ఇంటింటికీ తిరుగుతూ జనసేన మ్యానిఫెస్టోను ప్రజలకు అందజేస్తూ జనసేనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా చేపట్టదలచిన అభివృద్ధిని గురించి ప్రజలకు వివరించారు. బీజేపీ కన్వీనర్ కృష్ణం రాజు సతీమణి దివ్య రాజు, చల్లా లక్ష్మీ, గంటా స్వరూపా, కడలీశ్వరి, శంకర్ గౌడ్, రంగ బాబు, అల్లం కిషోర్, తేజ, చంద్ర శేఖర్, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply