Suryaa.co.in

Andhra Pradesh

అరాచకానికి వైసీపీ మచ్చు తునక

– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్

ఆత్మకూరు బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కి మద్దత్తు గా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మరియు ఎస్. సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ చేజర్ల దళిత వాడల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మండలం లోని మామిడూరు, ఓబుళయ పల్లి, వావిలేరు, చిత్త లూరు తదితర దళిత వాడల్లో పర్యటించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఓబులాయ పల్లె లో దళితుల భూముల్లో వారి కి పట్టా పాస్ బుక్స్ వున్నా అందులో వారిని సాగు చేయనీయకుండా అగ్ర కులానికి చెందిన కొందరు అడ్డు కున్నారని వారికి అధికార పార్టీ అండదండలు ఉన్నాయని అన్నారు.

మామిడూరు లో దళితులు రచ్చ బండ స్వంత నిధులతో వేడుకోడానికి సిద్ద మైతే వైసీపీ పార్టీ అడ్డుకుంటుందని అన్నారు. అదే విధంగా వాటర్ ప్లాంట్ దళితులు వేసుకోకుండా వైసీపీ అడ్డుకుంటుందని విల్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విల్సన్ వెంట దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు దర్శిగుంట వాసు, బిజేపి నేత బైరప్ప, మరో బీజేపీ నేత ఎస్. ఎస్. ఎస్ ఆర్ నాయుడు మరియు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE