-టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తా
– గద్దర్ కూతురు వెన్నెల
కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నాను. టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ కోసం పనిచేస్తా.ఎన్నికల్లో పోటీ చేయడానికి మేం సిద్దంగా ఉన్నాం.కొన్ని రోజులుగా నా పేరు మీడియాలో వస్తోంది.రాజకీయాల్లోకి రమ్మని చాలా మంది నాపై ఒత్తిడి చేస్తున్నారు. నాకు కాంగ్రెస్ అవకాశం ఇస్తే పోటీ చేస్తాను.మాలో ప్రజల కోసం కొట్లాడాలనే ఫైటింగ్ స్పిరిట్ ఉంది.
కంటోన్మెంట్ సీటు ఇస్తే అక్కడి కాంగ్రెస్ నాయకులను కలుపుకొని పని చేస్తా.మా నాన్న చివర్లో కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు.వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని గద్దర్ అన్నారు.ఓడిపోయినా సరే ఎన్నికల్లో పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించారు.నాన్న ఆశయాన్ని నెరవేర్చడానికే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నా.
గద్దర్ జీవితాంతం సమసమాజం కోసం తపన పడ్డారు.భారత రాజ్యాంగాన్ని అమలు పరచాలని గద్దర్ కోరుకునేవారు.రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తామని కాంగ్రెస్ అంటోంది కాబట్టే కాంగ్రెస్ కి మా మద్దతు.టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాను.
గద్దర్ భార్య విమల …
నా బిడ్డకి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు మీడియాలో వస్తోంది.నా బిడ్డకి టికెట్ ఇస్తే ఆమె తరపున ప్రచారం చేస్తా. నా బిడ్డకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నా..