Suryaa.co.in

Andhra Pradesh

గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్దం

– టిడిపి గిరిజన విభాగం నేతలు

వైసిపి ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాటానికి తాము సిద్దం అవుతున్నట్లు టిడిపి గిరిజన విభాగం నేతలు పార్టీ అధినేత చంద్రబాబుకు వివరించారు. మూడున్నరేళ్ల వైసిపి పాలనలో తమ వర్గానికి జరుగిన అన్యాయంపై దీర్ఘకాలిక పోరాటాలకు సిద్దం అవుతున్నట్లు వారు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో టిడిపి గిరిజన నేతలు ధారు నాయక్, దొన్ను దొర, మొగిలి కల్లయ్య,కత్తి పద్మ పార్టీ అధినేతను కలిశారు. మైదాన ప్రాంతంలో ఐటిడిఎ ఏర్పాటు, గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టులను గిరిజనులతోనే భర్తీ చెయ్యడం, ఎస్ టి సబ్ ప్లాన్ నిధుల దారిమళ్లింపు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై పోరాటాలకు సిద్దం అవుతున్నట్లు తెలిపారు.

LEAVE A RESPONSE