– పోలీసులకు నోటీసుల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్
అక్రమ అరెస్టులపై పోలీసులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలి. ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం మీరు చేసే చట్ట ఉల్లంఘనలు మిమ్మల్ని సైతం బోనులో నుంచో పెడతాయి. మీరు మూల్యం చెల్లించుకోకతప్పదు. విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్ అక్రమమని కోర్టు ఆయన రిమాండ్ తిరస్కరించడం పై డిజిపి సమాధానం చెప్పాలి.
అంకబాబుకు 41 -A Cr.P.C నోటీసు ఇచ్చే విషయంలో పోలీసులు చట్టాన్ని ఫాలో అవ్వలేదని మెజిస్ట్రేట్ కోర్ట్ చెప్పింది. అంతే కాకుండా దీనిపై నాలుగు రోజుల్లో వివరణ ఇవ్వాలని కేసు పెట్టిన సిఐడి పోలీసులకు షో కాజ్ నోటీసులు ఇచ్చింది. అంకబాబుకు నోటీసులు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చారు? మీరు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారన్న దానికి సాక్ష్యం ఏంటి అని కూడా కోర్టు ప్రశ్నించింది.
అక్రమ అరెస్టు లకు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి ఏపీ పోలీస్ శాఖను తీసుకువచ్చింది ఎవరు? తమ తప్పుడు వైఖరికి సిఐడి సిగ్గు పడాలి. రాష్ట్రంలో చట్ట ఉల్లంఘనలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటన ద్వారా మరో సారి నిరూపితం అయ్యింది.
ప్రజలను, రాజకీయ పక్షాలను భయపెట్టేందుకు అధికారం పూర్తిగా దుర్వినియోగం అవుతుంది. రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తుంది అనడానికి ఇంతకంటే ఏం రుజువులు కావాలి? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ దీనికి సమాధానం చెప్పాలి.