-లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తా
– ఎంపీ మిథున్ రెడ్డి
తిరుపతి: వైసీపీ కోసం అరెస్ట్ కాదు.. ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. “ఫలితాల తర్వాత మా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. మా వారిని పరామర్శించేందుకు వెళ్తున్న నన్ను అడ్డగిస్తున్నారు. ఎంపీగా నాకు ఉన్న అర్హత అడ్డుకుంటున్నారు. పోలీసులు నన్ను వెళ్లద్దంటున్నారన్నారు. దీనిపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాను” అని తెలిపారు.
ఎన్నికల ఫలితాల అనంతరం పుంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్ పరిధిలో భౌతిక దాడులకు టిడిపి పాల్పడుతోంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి పుంగనూరు లో ఎప్పుడు లేని కొత్త సంస్కృతికి తెర లేపుతున్నారు. జేసిబీలు తెచ్చి పేదల ఇల్లు కులదోస్తున్నారు.
ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం, కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణం.ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో పరిస్థితి ఈరోజు పుంగనూరు లో ఉంది.మా వారిని ప్రరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. నా నియోజకవర్గంలో నన్ను పర్యటించకుండా అడ్డుకుంటున్నారు.
రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. మాకు ఓటు వేసిన 40 శాతం మందిని రాష్ట్రం నుండి తరిమేస్తారా ? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మేము అండగా ఉంటాం. పార్టీ మారమని మా కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఒత్తిడి చేసి, ప్రలోభాలు చేయడం ద్వారా పార్టీలు మార్పిస్తే లాభం లేదు.
ఇన్ని గొడవల నేపద్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీ యాజమాన్యం సందిగ్ధం లో పడింది. భవిష్యత్తు లో పుంగనూరు లోకి ఏ పరిశ్రమలు రాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. నేను బిజెపి కి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారు. చల్లా బాబును అనేక సంవత్సరాల నుండి చూస్తున్న. ఇలాంటివి ఎప్పుడు లేవు. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు అని చల్లా బాబుకు సలహా ఇస్తున్న. పోలీసులు పై దాడి చేసి చల్లా బాబు జైలుకి వెళ్ళారు. మంత్రి పదవి భద్రపరుచుకోవడం కోసం రాం ప్రసాద్ కూడా మా పై అనేక విమర్శలు చేస్తున్నారు.