తెలుగుదేశపు అనుబంధ విభాగమైన “తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ “రి బిల్డ్ ఏపీ” పేరుతో యువతకు అవగాహనా సదస్సులను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజమండ్రి , బాపట్ల, మరియు తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాలలో మొదటి విడత అవగాహనా సదస్సులను ప్రారంభించారు. బాపట్ల లో నరేంద్ర వర్మ అతిధి గ పాల్గొన్గా.. TPW జనరల్ సెక్రటరీ వీర కనకమేడల ,TPW జోన్ 3 ఇంచార్జి త్రినాథ్ , TPW బాపట్ల పార్లమెంట్ ఇంచార్జి కళ్యాణ్ రామ్ అధ్యక్షత వహించారు.
రాజమండ్రి లో KS జవహర్ ముఖ్య అతిది గా పాల్గొనగా, TPW జనరల్ సెక్రటరీ కొండయ్య చౌదరి , tpw రాజముండ్రి పార్లమెంట్ ప్రెసిడెంట్ కారానికి శ్రీనివాస్ , జనరల్ సెక్రటరీ భవాని శంకర్ అధ్యక్షత వహించారు. తిరుపతి లో సుగుణమ్మ , నరసింహ యాదవ్ ముఖ్య అతిధులు గా పాల్గొనగా.. TPW జనరల్న సెక్రటరీ నయీమ్ , TPW జోన్ 4 ఇంచార్జి సునీల్ tpw తిరుపతి పార్లమెంట్ ప్రెసిడెంట్ Sumanth అధ్యక్షతన ప్రొఫెషనల్స్ టీం సభ్యులు పాల్గొన్నారు .
గత మూడు సంవత్సరాలుగా మన రాష్ట్రము అభివృద్ధి తిరోగమనం , పెట్టుబడులు, పరిశ్రమలు , ఉద్యోగాలు రాకపోవడం, రాజధాని నిర్మాణం ఆగిపోవడం వంటి దుస్థితిని, పరిస్థితిని చూసి చలించిన ప్రతి ఒక్కరు, ఇందులో భాగం అయ్యేలా తెలుగుప్రొఫెషనల్స్ వింగ్ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. అన్నిటిలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ.. రాష్ట్ర సంక్షేమాన్ని, ప్రగతిని కాంక్షించి సుపరిపాలనను అందించాల్సిన అవసరాన్ని.. రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా యువతను ,ప్రొఫెషనల్స్ ను ఏకం చేస్తూ, రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించే ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ.. ముందుకు సాగే లక్ష్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం గూర్చి తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ మెంబెర్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.