– ఉప సభాపతి పద్మారావు
సికింద్రాబాద్ నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో అభివృధి పనులను చేపట్టామని, అయినప్పటికీ పరిష్కారానికి నోచని సమస్యల పై దృష్టి పెడుతున్నామని ఉప సభాపతి పద్మారావు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మెట్టుగూడ కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునీత, అధికారులు, నేతలతో కలిసి అయన సోమవారం మెట్టుగూడ డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు. విజయపురి కాలని, రైల్వే క్వార్టర్స్, మెట్టుగూడ ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన సమస్యల పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆయా సమస్యల పరిష్కారానికి కాల పరిమితిని నిర్దారిస్తున్నామని తెస్రి తీగుల్ల పద్మారావు
గౌడ్ తెలిపారు. పర్యటనలో తెరాస యువ నేతలు కిషోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్ లతో పాటు వివధ విభాగాల అధికారులు రమణా రెడ్డి, ఆశలత, డేవిడ్ రాజు, డాక్టర్ రవీందర్ గౌడ్, విశ్వా తేజ, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు తన కార్యాలయం లో జలమండలి, జీ హెచ్ ఎం సి ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో పద్మారావు సమావేశమయ్యారు. వివిధ అభివృధి పనుల పురోగతిని సమీక్షించారు.