– సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పారిశ్రామిక వాతావరణం
– సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో ప్రభుత్వ అండ
– ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావు
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ మాడ్యులర్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్క్స్ అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఐఐసీ గుంటూరు జోనల్ మేనేజర్ నరసింహారావు పారిశ్రామికవేత్తలకు పలు కీలక సూచనలు చేశారు.
ఎంఎస్ఎంఈ పార్కుల్లో పరిశ్రమలు స్థాపిస్తే లభించే ప్రత్యేక సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, ఆధునిక సౌకర్యాలు గురించి ఆయన వివరించారు. “పారిశ్రామికవేత్తల వెనుక ప్రభుత్వం బలమైన అండగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పరిశ్రమలకు మరింత అనుకూల వాతావరణం కల్పించబడుతుంది” అని నరసింహారావు అన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బోడేపూడి సుబ్బారావు (బీఎస్ఆర్), ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్యామ్, ఆచారి తదితరులు పాల్గొన్నారు.