-సన్యాసినిగా మారిన శ్రీరెడ్డి?
-సోషల్‌మీడియాలో ఫొటోలు వైరల్
( మార్తి సుబ్రహ్మణ్యం)
హలో.. ఈ ఫొటో ఎవరిదో చూశారా? కనిపెట్టడం కొంచెం కష్టంగా ఉందా? ఇంకొంచెం కళ్లు పెద్దవిచేసి చూడండి. ఈ స్వామి ఎవరో తె లుస్తుంది. ఏంటీ ఇంకా అర్ధం కాలేదా? ఆయన స్వామి కాదు. సన్నాసామె! సారీ.. సన్యాసామె!! ఇంకా మీకు వెలగలేదా? అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో! జీకెలో అంత పూరయితే కష్టం కదండీ. సినిమాలే కాదు. అప్పుడప్పుడు యూట్యూబులూ చూస్తుండాలండి. సరే మీకు ఇంకో చాన్సు. అప్పుడోసారి హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ చాంబరు ఆఫీసులో, బట్టలిప్పి నగ్నప్రదర్శన చేసింది కదా? ఇంకా గుర్తురాలేదా? ప్చ్!
పోనీ.. మొన్నామధ్య జగనన్న చెల్లెలు షర్మిలను, బండబూతులు తిట్టిన జగనన్న వీరాభిమాని ఎవరో గుర్తొచ్చిందా? అంతకుముందు మంత్రి రజనీనుద్దేశించి.. ‘ఏంటీ అంత తిప్పుకుంటున్నావ్. నీకంతలేదు. కాస్త తగ్గించుకో’మని అసూయతో వార్నింగు ఇచ్చిన యూట్యూబర్ ఆమె. ఇప్పుడు గుర్తొచ్చిందా? హమ్మయ్య. ఆమెనే ఆలిండియా జగన్మోహన్‌రెడ్డి అభిమాన మహిళా సంఘానికి తమిళనాడు అధ్యక్షురాలు శ్రీరెడ్డి మేడమ్ అన్నమాట!
ఇప్పుడామె టాపిక్కు మనకెందుకంటారా? మామూలుగా అయిదే అది కరెస్టే. కానీ ఇప్పుడు శ్రీరెడ్డి సన్యాసం పుచ్చుకుని, సన్నాసిని.. సారీ సన్యాసిని అయినట్లు.. త్వరలో రెడ్డమ్మ శ్రీరెడ్డిపీఠం కూడా పెట్టబోతున్నట్లు సోషల్‌మీడియా కోడై కూస్తోంది. ఎప్పుడూ నిండుగా కొంగుకప్పుకుని, పట్టుచీరతో భారతీయ స్త్రీలా కనిపించే శ్రీరెడ్డి.. ఒక్కసారి సన్యాసిని ఎందుకయింది? ఎప్పుడయిందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దానికి సంబంధించిన ఒక ఫొటో తెగ చక్కెర్లు కొడుతోంది.
ఇందులో పెద్ద ఆశ్చర్యమేమీలేదు. ఇప్పుడు చాలామంది సినిమావాళ్లు.. పాపప్రక్షాళన కోసం గుళ్లూ-గోపురాలు తిరిగి, ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నారు. అంతకుముందు ప్రముఖ నటుడు ధూళిపాళ్ల కూడా కాషాయం కట్టేశారు. లేటెస్టుగా కడప జిల్లాలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివరామకృష్ణ కూడా రాజకీయాలు చాలించి, సన్యాసి అవతారమెత్తారు. అలా.. మన యంగ్ లేడీ శ్రీరెడ్డి కూడా యూట్యూబర్ జీవితంపై విరక్తి వచ్చి, ఏ హిమాలయాలకో, ఏ రిషికేష్‌కో వెళ్లి శేషజీవితాన్ని అక్కడే గడిపేస్తూ ఆవిధంగా ముందుకువెళుతున్నారేమో అన్నది సోషల్‌మీడియా వనంలో వినిపిస్తున్న టాక్.
అన్నట్లు అక్కడ రిషికేష్‌లో మన జగన్గురువు-జగద్గురువు- ఆదిశంకరాచార్య అంశతో చినముషిడివాడలో అవతరించిన శ్రీమాన్ విశాఖ స్వరూపానంద భగవత్పాదుల వారి ఆశ్రమం కూడా ఉంది కాబట్టి, ఇక ల్యాంగేజీప్రాబ్లెమ్ లేనట్లే. వీలుంటే అక్కడి సర్కారుతో మాట్లాడుకుని, ఒక ఎకరం భూమిలీజుకు తీసుకుని శ్రీరెడ్డి పీఠం పెట్టుకోవచ్చు.
ఆ మేరకు సన్యాసినిగా మారిన శ్రీరెడ్డి ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవటం వరకూ బాగానే ఉంది. అసలు నిజమా? అబద్ధమా? నిర్ధారించేవారెవరూ లేరు. అయితే ఒకటి మాత్రం నిజం. ఒకవేళ రెడ్డమ్మ సన్యాసినిగా మారితే.. జగనన్న అభిమానులను ఇకపై యూట్యూబ్‌లో అలరించేవారెవరన్నది ఒక్కటే బాధ.