Suryaa.co.in

Editorial

మైనింగ్‌లో జగన్ సన్నిహితులకే మళ్లీ ‘రెడ్డి’ కార్పెట్

  • జగన్ జమానా కంపెనీలకే మళ్లీ కొనసాగింపు

  • సీనరేజీ వసూళ్లన్నీ మళ్లీ పాత కంపెనీలకే

  • మళ్లీ మీసం మెలేసిన కాంగ్రెస్ మంత్రి పొంగులేటి కంపెనీ

  • ప్రైవేటు కంపెనీలకు వసూళ్ల బాధ్యతలా?

  • తెలంగాణ మంత్రి కంపెనీలకే ‘రెడ్డి’ కార్పెట్

  • బాబుకు తెలియకుండా నిర్ణయాలు?

  •  సర్కారు కళ్లకు అధికారుల గంతలు

  • చక్రం తిప్పిన ఓ మీడియా సంస్థ అధినేత

  • అదేరోజు ఆయన పవర్ ప్రాజెక్టుకూ అనుమతులు?

  • మరో లైవ్ టె లికాస్టు అనుమతులూ అదేరోజు?

  • గతంలో ఆ కంపెనీలపై విరుచుకుపడ్డ టీడీపీ

  • అధికారంలోకి వస్తే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరిక

  • ఇప్పుడు మళ్లీ అవే కంపెనీలకు అనుమతులపై నేతల విస్మయం

  • చంద్రబాబుకు చెప్పకుండానే అధికారుల అనుమతులు
  • మైనింగ్ శాఖ మంత్రి నిమిత్తమాత్రుడేనా?

  • ఆ కంపెనీల కొనసాగింపుపై టీడీపీ సీనియర్ల అసంతృప్తి

  • మండిపడుతున్న టీడీపీ సోషల్‌మీడియా సైన్యం

  • జిల్లాల్లో నిలిచిపోయిన మైనింగ్ కార్యకలాపాలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్ జమానాలో ఓ రేంజ్‌లో డబ్బులు దండుకున్న ఏ కంపెనీలయినా కూటమి సర్కారు రాగానే సహజంగానే హడలిపోవాలి. తమ అనుమతులు ఎక్కడ రద్దు చేస్తుందో.. వాటిపై ఎక్కడ విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తుందోనని నిలువునా వణికిపోవాలి. ఎందుకంటే.. ఎన్నికల ముందు వరకూ ఈ కంపెనీలకు ఇచ్చిన సీనరేజీ వసూళ్ల విధానంపై, విపక్షంలో ఉన్న టీడీపీ అగ్గిరాముడి మాదిరిగా అంతెంత్తున కాలు-కత్తులూ దూసింది కాబట్టి!

కానీ ఇప్పుడు సీన్ రివర్స్. కూటమి సర్కారు వచ్చిన వెంటనే.. జగన్ జమానాలో దర్జాగా మైనింగ్ సీనరేజీ వసూలు చేసిన అవే కంపెనీలకు, మళ్లీ ‘రెడ్డి’ కార్పెట్ వేసింది. తెలంగాణ మంత్రి గారి కంపెనీకయితే ఇంకో జిల్లాను అదనంగా, పువ్వుల్లో పెట్టి మరీ అప్పగించింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మూల‘ధనం’గా ఉన్న సదరు మంత్రిగారి కంపెనీ, జగనన్న జమానాలో ధగధగ మెరిసింది. అన్ని కాంట్రాక్టులూ ఆయనకే దక్కేవి. మళ్లీ ఇప్పుడూ ఆ మెరుపులు కొనసాగుతుండటమే విచిత్రం. అదే ఇప్పుడు టీడీపీ సీనియర్ల అసంతృప్తికి కారణమవుతోంది. ఇది బయటకు తెలిస్తే పార్టీ పరువు ఏమవుతుందన్నది వారి ఆందోళన.

అసలు ఇవన్నీ సీఎం చంద్రబాబుకు తెలియకుండా, అధికారులే నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది వారి అనుమానం. ఇక కూటమిలోనూ ఈ ‘రెడ్డి’ కార్పెట్ వ్యవహారానికి.. కర్త కర్మ క్రియ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే, ఓ మీడియా సంస్థ అధినేత అన్నది టీడీపీ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ. ఆయన ఆ కంపెనీల పక్షాన రాయబారం నడపటంతోపాటు.. జగన్ నిలిపివేసిన తన కృష్ణా జిల్లాలోని పవర్ ప్రాజెక్టుకు ఎన్‌ఓసీ.. పనిలోపనిగా లైవ్ టెలికాస్ట్‌కు అనుమతి, ఒకేరోజు తెచ్చుకున్నారన్నది ఆ చర్చల సారాంశం.

పార్టీ-ప్రభుత్వ ప్రతిష్ఠతో ముడిపడిన కీలక వ్యవహారాలు-నిర్ణయాలు పార్టీ అధినేత-సీఎం చంద్రబాబునాయుడుకు తెలియకుండానే, ఐఏఎస్ అధికారుల స్థాయిలో గుంభనంగా జరిగిపోతున్నాయా?.. ఐదేళ్లు ప్రాణాలకు తెగించి జగన్‌పై యుద్ధం చేసి, సాధించిన అధికారానికి ప్రమాదం వస్తోందా? జగన్ జమానాలో కాంట్రాక్టర్లు సంపాదించి వేల కోట్లకు పడగలెత్తిన బడా బాబులకే, కూటమి పాలనలో పెద్దపీట వేయడం వెనక ఉన్నదెవరు? ఇవన్నీ ఏ స్థాయిలో నిర్ణయిస్తున్నారు?

56 రోజులు అన్యాయంగా జైల్లో ఉన్న చంద్రబాబు ఇమేజీతో ఏర్పడిన ప్రభుత్వానికి మచ్చ తెస్తుందెవరు? మైనింగ్ సీనరేజీ కాంట్రాక్టులను తిరిగి జగన్ సన్నిహితులకే కట్టబెట్టిన ‘బిజినెస్ బంధం’ వైనం వెలుగులోకి వచ్చిన తర్వాత.. భుజాలు పుండ్లు పడేలా పార్టీ జెండా మోసిన టీడీపీ సైనికుల మనోభావాలివి!

జగన్ హయాంలో మైనింగ్ లీజుదారుల నుంచి సీనరేజీ వసూళ్లను తన సన్నిహితులు, తన కులానికి చెందిన విశ్వసముద్ర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఉమ్మడి శ్రీకాళుం జిల్లా; తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విజయనగరం, హిల్ సైడ్ ఎస్టేట్స్ ఎల్‌ఎల్‌పికి కడప; సుధాకర ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చిత్తూరు; అమిగోస్ మినరల్స్‌కు అన ంతపురం; ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్‌కు ఉమ్మడి గుంటూరు జిల్లా అప్పగించారు. వీరిలో దాదాపు అందరూ జగన్‌కు అత్యంత సన్నిహితులే. ఇందులో విశ్వసముద్ర కంపెనీ మినహా.. మిగిలినవారంతా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారేనంటున్నారు.

విశ్వసముద్ర కంపెనీ నిర్వహకులు కమ్మ సామాజికవర్గానికి చెందిన నవయుగ కంపెఈ రక్త సంబంధీకులయినప్పటికీ.. కుటుంబంలో వచ్చిన విబేధాలతో ఆ కంపెనీలో కీలక వ్యక్తి బయటకు వచ్చి, కొంతమందితో కలసి ఈ కంపెనీ స్థాపించారు. ఎన్నికల ముందు బెంగుళూరుకు చెందిన ఓ స్వామీజీని ఈ కంపెనీ హెలికాఫ్టర్‌లోనే జగన్ వద్దకు తీసుకువచ్చారన్న ప్రచారం జరిగింది. అదానీకి కృష్ణపట్నం పోర్టు అప్పగించడంలోనూ, జగన్ ఈయననే అస్త్రంగా సంధించారంటున్నారు. ఆ కంపెనీ స్థాపకుడి తండ్రితో, టీడీపీ రాజగురువుగా భావించుకునే ఓ మీడియా సంస్థ అధిపతికి సత్సంబంధాలున్నాయన్నది బహిరంగమే.

అసలు ప్రైవేట్ కంపెనీలకు లీజుదారుల నుంచి సీనరేజీ వసూలు చేసే బాధ్యత కట్టబెట్టడమే తప్పు. ప్రభుత్వం చేయాల్సిన పనిని జగన్ తన మేలు కోరే కంపెనీలకు ఇవ్వడంపై అప్పట్లో టీడీపీ నేతలు పట్టాభి, జీవీ రెడ్డి, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అప్పట్లోనే విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే వాటి అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. అసలు సీనరేజీ వసూళ్లు ప్రైవేటు కంపెనీలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

నిజానికి ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వానికి నెలకు 10 నుంచి 15 కోట్లు చెల్లించి టెండరు దక్కించుకుంటాయి. ఆ తర్వాత తమ ఇష్టం వచ్చిన రేట్లకు మైనింగ్ లీజుదారుల నుంచి సీనరేజీ వసూలు చేస్తాయి. జగన్ జమానాలో సీనరేజీ టెండరు దక్కించుకున్న ఈ కంపెనీలు చేసింది అదే. అయితే ప్రభుత్వం మారినప్పటికీ జరుగుతోంది అదే కావడం కూటమి శ్రేణుల ఆశ్చర్యానికి కారణం.

ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో జగన్ సర్కారు కూలిపోయి, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కారు ఆవిర్భవించింది. దానితో.. జగన్ సన్నిహిత కంపెనీల భరతం పడతారని పార్టీ శ్రేణులు, నేతలు భావించారు. వాటి అనుమతులు రద్దు చేసి, సీనరేజీ వసూళ్ల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని అంచనా వేశారు. పైగా ఐదేళ్లనాటి సీనరేజీ అవినీతిపై విజిలెన్స్‌తో విచారణ జరిపి, జగన్ సన్నిహిత కంపెనీల తోలు తీస్తుందని తమ్ముళ్లు భ్రమించారు.

అయితే విచిత్రంగా ఆగస్టు 23న మైనింగ్ శాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, డీజీపీకి రాసిన లేఖలో.. మళ్లీ అవే కంపెనీలకు రెండేళ్ల పాటు మైనింగ్, క్వారీ లీజుదారుల నుంచి సీనరేజీ వ సూలు చేసే అధికారం కట్టబెడుతున్నట్లు.. లెటర్ నెంబర్ 11399/ఎంఆర్/ఎస్‌సీసీ/2022 పేరుతో రాసిన లేఖ, వారం తర్వాత బయటకు లీకవడం టీడీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బతీసినట్టయింది.

ప్రధానంగా టీడీపీ సోషల్‌మీడియా సైనికులు ఈ నిర్ణయంతో పూర్తిగా డీలాపడ్డారు. అప్పటికే టీడీపీని సమర్ధించే మీడియాలో సైతం.. జగన్ సర్కారులో పెత్తనం అనుభవించి, కార్యకర్తలపై దాడులు చేసి, జైల్లో వేయించిన వారికే పోస్టింగులిస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. దానికి ఈ నిర్ణయం తోడవడంతో.. ‘‘పైస్థాయిలో ఏదో జరుగుతోంది. అంతా ఒక్కటే. మనం అమాయకంగా పార్టీకి పనిచేశాం’’ అన్న భావన బలపడేందుకు కారణమయ్యాయి.

పార్టీని అధికారంలోకి రాకుండా కార్యకర్తలు-నేతలపై ఉక్కుపాదం మోపిన జగన్ జమానాలో లబ్ధి పొందిన వారికే.. తాము పోరాడి తెచ్చుకున్న సొంత పార్టీ ప్రభుత్వం, కాంట్రాక్టులు కట్టబెట్టడాన్ని టీడీపీ సోషల్‌మీడియా సైనికులు, క్షేత్రస్థాయిలో పనిచేసే టీడీపీ యోధులు, జగన్ పాలనలో జైళ్లకు వెళ్లిన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఈ కంపెనీలకు సీనరేజీ వసూళ్ల బాధ్యత , పాతవారికే కొనసాగించడంపై టీడీపీ సోషల్‌మీడియాలో విమర్శల తుపాను కొనసాగడం ప్రస్తావనార్హం.

కాగా జగన్ జమానాలో సీనరేజీ కాంట్రాక్టుల కిరీటం పెట్టిన కంపెనీలనే కొనసాగించడం వెనుక.. టీడీపీ-కూటమి సర్కారుకు, రాజగురువుగా భావించుకునే ఓ మీడియా సంస్థ అధినేత చక్రం తిప్పినట్లు పార్టీ వర్గాల్లో బహిరంగంగానే చర్చ జరుగుతుండటం విశేషం. ఈ మొత్తం వ్యవహారంలో.. సదరు మీడియా సంస్థ అధిపతి రాయబారం నడిపి, స్వకార్యం-స్వామికార్యం తీర్చినట్లు కూటమి వర్గాల్లో బహిరంగ చర్చ జరుగుతోంది.

జగన్ అనుకూల కంపెనీలనే తిరిగి కొనసాగించడంతోపాటు… కృష్ణాజిల్లాలోని తన పవర్ ప్రాజెక్టుకు ఎన్‌ఓసీ, లైవ్ టెలికాస్టు అనుమతులపై సంతకం చేయించుకున్నట్లు కూటమి వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జగన్ జమానాలో కృష్ణాజిల్లాలోని ఆయన పవర్ ప్రాజెక్టుకు ఎన్‌ఓసీ రద్దు చేసిన వైనం తెలిసిందే. డీల్‌మేకర్‌గా పేరున్న సదరు ‘గంధర్వుడి’ వ్యవహారం వల్ల.. పార్టీ శ్రేణుల మనోభావాలతోపాటు, ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం వచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ మొత్తం వ్యవహారం సీఎం చంద్రబాబుకు తెలియకుండా, అధికార వర్గాల్లోనే నిర్ణయాలు తీసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు మైనింగ్ శాఖ మంత్రిని సైతం నిమిత్తమాత్రుడిని చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అప్పుల్లో ఉన్న సర్కారును తిరిగి ఆర్ధికంగా పరిపుష్ఠం చేసేందుకు బాబు దృష్టి సారిస్తున్న సమయంలో.. పవర్ బ్రోకర్లు రంగంలో దిగి, వ్యవహారాలు చక్కబెడుతున్నారన్న చర్చ కూటమి వర్గాల్లో జరుగుతోంది.

పోనీ ఇంత పైరవీ చేసి, మళ్లీ పాత కంపెనీలకే సీనరేజీ వసూళ్ల బాధ్యతలు పొందిన కంపెనీలేమైనా, కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకువచ్చాయా అంటే అదీ లేదు. ఇప్పటివరకూ వాటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఫలితంగా ఆ ఏడు జిల్లాల్లో మైనింగ్ తవ్వకాలు, రవాణాపై ప్రభావం చూపిస్తోంది. దీనితో కార్మికుల జీవనోపాథి దెబ్బతింది. అయితే ఈ వ్యవహారం పర్మిట్లు లేకుండా రవాణా చేసే వారికి రాజమార్గంగా మారింది.

నిజానికి ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచీ, సీనరేజీ కాంట్రాక్టర్లు తమ కార్యకలాపాలు నిలిపివేశారు. ఆ క్రమంలో కొద్దిరోజుల తర్వాత సీనరేజీ వసూళ్లు పాత కంపెనీలకే కొనసాగించాలని, అయితే అవి తమ పాత బకాయిలు చెల్లించాలని, ఆన్‌లైన్ పర్మిట్లు జారీ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అయినా కాంట్రాక్టర్లలో స్పందన లేదు. మళ్లీ ఈనెల మొదటి వారంలో కాంట్రాక్టర్లతో మీటింగు పెట్టి, పర్మిట్లు జారీ చేయాలని ఆదేశించినా అదే పరిస్థితి.

ఈ ఏడు ఉమ్మడి జిల్లాల్లో పాలిషింగ్ యూనిట్లు, గ్రానైట్ క్వారీలు, గ్రానైట్ కటింగ్ యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ జిల్లాల్లో మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. జూన్ మొదటివారం నుంచి పర్మిట్ల జారీ నిలిచిపోవడంతో, ఆయా లీజుల్లో తవ్వకాలు నిలిచిపోయాయి. గ్రానైట్ లీజుదారులు తమ ముడిరాయిని ఎగుమతి చేయాలంటే పర్మిట్లు తప్పనసరి కావడం గమనార్హం. దానితో కొనుగోలుదారులు విధిలేక, పక్క రాష్ట్రాలకు వెళుతున్న పరిస్థితి. దీనివల్ల రాష్ట్రానికి రావలసి ఆదాయం కూడా పోవడం మరో ఆందోళనకర అంశం.

పైస్థాయిలో లాబీ చేసి, గత సర్కారులో కంటే అదనపు కప్పం కట్టిన ఈ కంపెనీలేమైనా పాతబకాయిలు చెల్లించారా అంటే అదీ లేదు. ఇవి ఒక్కో జిల్లాకు ప్రతి నెల 15 కోట్ల రూపాయల వరకూ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీనితో తమ వ్యాపారాలు నష్టపోవలసి వస్తోందని లీజుదారులు గగ్గోలు పెడుతున్నారు. తమకే కాకుండా ప్రభుత్వానికి కూడా జీఎస్టీ, పర్మిట్ల వల్ల వచ్చే ఆదాయం పోతోందంటున్నారు.

ఇదిలాఉండగా.. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మహేశ్వర్‌రెడ్డికి చెందిన ఏఎంఆర్‌కు చిత్తూరు, విజయనగరం, క డప జిల్లాల సీనరేజీ బాధ్యతలను.. గుంటూరుజిల్లా టెండరు దక్కించుకున్న ఏఎంఆర్ కంపెనీకే కట్టబెట్టడం విశేషం. ఈ కంపెనీ ఆయా జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

పొంగులేటి కంపెనీకి పొంగిపొర్లిన కాంట్రాక్టులు
జగన్ జమానాలో ఒకప్పటి ఖమ్మం వైసీపీ ఎంపీ, ఇప్పుడు తెలంగాణలో సీఎం రేవంత్ స్థాయిలో చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు ఆయనే కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో బతికిస్తున్నారన్న ప్రచారం కూడా లేకపోలేదు. జగన్ హయాంలో ఆయన కంపెనీకి కాంట్రాక్టులు కట్టబెట్టారన్నది బహిరంగమే. సర్కారు ఆర్ధిక కష్టాల్లో ఉన్నప్పటికీ , పొంగులేటి కంపెనీకి మాత్రం ఠంచనుగా బిల్లులు చెల్లించేవారన్న వార్తలు వినిపించేవి.

ఈ సీనరేజీ వసూళ్లలో ఆయన కుటుంబానికి చె ందిన కంపెనీలు మీసం మెలేశాయి. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ విజయనగరం, చిత్తూరు, హిల్‌సైడ్ ఎస్టేట్స్ కడప జిల్లాలో సీనరేజీ వసూళ్ల కాంట్రాక్టును జగన్ సర్కారు అప్పగించింది. అయితే అప్పట్లో హవా చెలాయించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ కంపెనీ.. తన చిత్తూరు జిల్లావరకూ రాఘవకు బదులు, వసూళ్ల వ్యవహారాలను తాను చూసిందన్నది బహిరంగమేనంటున్నారు.

అయితే ఈ కంపెనీలు దేశంలోని జాతీయ బ్యాంకుల నుంచి కాకుండా.. విదేశానికి చెందిన యూరో ఎగ్జిమ్ బ్యాంకు గ్యారెంటీలు సమర్పిస్తామని చెప్పడం గమనార్హం. అసలు దాని విశ్వసనీయత ఏమిటో ఎవరికీ తెలియదు. అయితే దేశీయ బ్యాంకు గ్యారెంటీలనే సమర్పించాలని షరతు విధించడంతో.. రాఘవ కన్‌స్ట్రక్షన్స్, హిల్‌సైడ్ ఎస్టేట్, అమిగోస్ మినరల్స్ జాతయ బ్యాంకుల గ్యారెంటీలు సమర్పించేందుకు గడువు కోరినట్లు సమాచారం.
Letter-to-DGP-SCC-Contracts-23-08-24001

LEAVE A RESPONSE