Suryaa.co.in

Telangana

పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధర తగ్గింపు సాహసోపేత నిర్ణయం

-ఎరువుల సబ్సిడీ కోసం అదనంగా రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేయాలనుకోవడం చారిత్రాత్మకం
-స్టీల్, సిమెంట్ ధరల నియంత్రణ చర్యలూ విప్లవాత్మకం
-రాష్ట్ర ప్రభుత్వం సైతం తక్షణమే పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ పన్నును తగ్గించాల్సిందే
-లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు వెనుకాడబోం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైన చర్యగా బీజేపీ తెలంగాణ శాఖ భావిస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుంది.

గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో భారత దేశ ఆర్దిక వ్యవస్థ అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికితోడు రష్యా-ఉక్రెయిన్ యుద్దంవల్ల నిత్యావసర వస్తువుల దిగుమతులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ దేశ ప్రజల అవసరాల ద్రుష్ట్యా లీటర్ పెట్రోలుపై 9 రూపాయల 50 పైసలు, డీజిల్ 7 రూపాయల వరకు తగ్గేలా కేంద్ర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ముదాహం. తాజా నిర్ణయంతో కేంద్ర ఆదాయం లక్ష కోట్ల రూపాయల వరకు తగ్గుతుంది. అయినప్పటికీ ప్రజా శ్రేయస్సు ద్రుష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడంతోపాటు దేశంలో సంక్షేమ, అభివ్రుద్ధి కార్యక్రమాలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవడం అభినందనీయం.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ప్రతి గ్యాస్ సిలిండర్ పై 200 రూపాయలు ధర తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించడం సంతోషించదగ్గ పరిణామం. దీనివల్ల దేశంలోని 9 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోంది. తాజా నిర్ణయంవల్ల ప్రత్యక్షంగా కేంద్రంపై 6100 కోట్ల రూపాయల భారం పడుతున్పటికీ పేదల సంక్షేమం కోసం కేంద్రం సాహసోపేతం నిర్ణయం తీసుకుంది.

దీంతోపాటు నిర్మాణ రంగాన్ని ప్రభావితం చేస్తున్న స్టీల్, సిమెంట్ ధరలను తగ్గించడానికి కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఇనుమ, స్టీల్ ముడి సరుకును, వాటికి ఉపయోగించే ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతోపాటు ఆయా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని సైతం తగ్గించడం స్వాగతించదగ్గ పరిణామం. స్టీల్ ఎగుమతులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించడం ద్వారా సిమెంట్ ధరలను నియంత్రించి ప్రజలకు అందుబాటులో ఉండేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది.

బహిరంగ మార్కెట్ లో ఎరువులు ధరలు పెరుగుతున్నప్పటికీ… ఆ భారాన్ని సబ్సిడీ రూపంలో భరించేందుకు ప్రస్తుత బడ్జెట్ లో 1 లక్షా 5 వేల కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం అవసరమైతే అదనంగా మరో లక్షా 10 వేల కోట్లను కేటాయించేందుకు సిద్దంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించం గొప్ప నిర్ణయం.

యుద్దం, కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ రైతులకు ఇస్తున్నటువంటి రసాయిన ఎరువులను పాత ధరలకే అందించి రైతులకు ప్రయోజనం కలిగించడంతోపాటు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించి ప్రజలకు పెద్ద ఎత్తున ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ శాఖ తరపున అభినందనలు.

యుద్దం, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా సప్లయ్ చైన్ తెగినప్పటికీ… నిత్యావసర వస్తువులు పేదలకు కొరత లేకుండా ధరలను నియంత్రిస్తూ పేద, మధ్య తరగతి ప్రజలను కేంద్రం ఆదుకోవడం అభినందనీయం.

నరేంద్రమోదీ ఆధ్వర్యలోని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి దాకా అనేక సంక్షేమ పథకాలు చేపట్టింది. పేదల కోసం నిరంతరం క్రుషి చేస్తోంది. గత రెండేళ్లుగా ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారితో అతలాకుతలమైనా భారత దేశం స్థిరమైన ఆర్ధిక అభివ్రుద్ధి సాధించడంతోపాటు నిరాటంకంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం విప్లవాత్మక చర్య. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలను పంపిణీ చేసి ప్రజలను ఆకలి నుండి కాపాడిన అసలు సిసలైన పేదల ప్రభుత్వం శ్రీ నరేంద్రమోదీదే.

పెట్రోలు, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం గతంలోనూ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది. వరుసగా రెండోసారి కేంద్ర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ పన్నును తగ్గించకపోవడం దారుణం.

రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఈ విషయంలో దిగి రావాలి. కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా రాష్ర ప్రభుత్వం కూడా వెంటనే వ్యాట్ తగ్గించి రాష్ట్ర ప్రజలకు మరింత ఉపశమనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో ప్రజానుగ్రహానికి గురి కాక తప్పదు. అవసరమైతే వ్యాట్ పన్నును తగ్గించేదాకా ప్రజల పక్షాన నిలుస్తూ బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు వెనుకాడబోదని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE