మాటల కందని మాధుర్యంతో
వలపు వాన జల్లులో తడిసి….
నీ ప్రేమ గాఢాలింగనంలో
నా హృదయం కాసింత
ఊరట చెంది….
జగమునే మరిచిన వేళ …..
ఎద కాగితంపై రాసుకున్నాను
నా ప్రేమ నివేదన
ఆ పరమాత్మునికి
ఎన్ని జన్మలకైనా
నీవు తోడుగా ఉండే
వరమివ్వమని…..!!
ఎదలో పూచిన
మల్లెలు వాడక ముందే…..
ఎదురు చూసిన కన్నులు
కాయలు కాకముందే….
నిట్టూర్పులు విడుస్తూ
రేపు మాపు
లిఖించే అక్షరాలు
చెదిరిపోకముందే…..
నీమీద మనసే ఊపిరిగా
నీవు పంచిన మమతే
ఆయువుగా….
నిరీక్షణా తలపులతో
ఎదురు చూస్తున్నా…
నా చేయి అందుకో….
కంటి నీరే తప్ప…
కలలే రాని…
కనురెప్పల కింద
“ప్రతిబింబమై “నిలిచిపో…..!!
– నలిగల రాధికా రత్న