అందుకు ఈ ఏడాది పది ఫలితాలే నిదర్శనం
ఎంపి విజయసాయిరెడ్డి
విద్యారంగంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని,అందుకు ఈ ఏడాది పదో తరగతి పరీక్షల ఫలితాలే నిదర్శనమని రాజ్యసభ సభ్యులు,వైఎస్సార్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.. ఈ ఏడాది పదోవ తరగతి ఫలితాల్లో 72.26 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని,ఇది గతేడాది కంటే 5% శాతం పెరుగుదల సాధించిందన్నారు.కాగా ఈ పరీక్ష ఫలితాల్లో మొదటి స్థానంలో మన్యం జిల్లా నిలిచిందన్నారు.
వర్షల సమయంలో అన్నదాతకు అండగా జగన్ ప్రభుత్వం
కష్టపడి పండించిన పంట చేతికొస్తున్న సమయంలో అకాల వర్షాలతో అన్నదాతలు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని చెప్పాడు..జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రచారానికి దురంగా ఉంటూ ధాన్యం సేకరణకు ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. అందుకోసం జిల్లాకో సినియార్ ఐఏఎస్ అధికారిని ప్రభుత్ం నియమించిందని చెప్పారు..
వలస పక్షులు రక్షణకు కేంద్రం చర్యలు చెపట్టాలి
భారతదేశానికి వచ్చే వలస పక్షులు వాటి ఆవాసాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ట్విట్టర్ లో కోరారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అడవులు తగ్గిపోవడం, నీటి వనరులు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. పక్షుల వేట,అక్రమ కార్యకలాపాలు అరికట్టడంతో పాటగా,వేటగాళ్లపై నిఘాను ఏర్పాటు చెయ్యాలన్నారు. వ్యవసాయం మరియు చేపల పెంపకంలో పురుగుమందుల వాడకం, సరస్సులు మరియు నదులు ఎండిపోవడం కూడా వలస పక్షుల క్షీణతకు కారణమవుతుందని నిపుణుల హెచ్చరిస్తున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో వలస పక్షులు భారతదేశానికి వస్తుంటాయని, కేంద్రం దీనిపై కూడా తగు దృష్టి పెట్టాలని కోరారు.