Suryaa.co.in

Andhra Pradesh

తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోండి

– డెడ్‌లైన్‌… 4వతేదీ మధ్యాహ్నం ఒంటి గంట!
– ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా రెడ్డి

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన నాలుగు వేల మంది కార్మికులను ఈ నెల నాలుగోతేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోపు విధుల్లోకి తీసుకోవాలని ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా రెడ్డి డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బుధవారం బైఠాయించి ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే… ఈ నెల 4 న మధ్యాన్నం ఒంటి గంట లోపు తొలగించిన 4200 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల్లో తీసుకోవాలి. లేకుంటే ప్లాంట్ ఆవరణలోనే తొలగించిన కార్మికులకు అండగా నిరాహార దీక్ష కు దిగుతా.. నాలుగు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వలేదు. నోటీసు ఇవ్వకుండా తొలగించడం దుర్మార్గం. విశాఖ స్టీల్ ఆంధ్రులకు తలమానికం. కాంగ్రెస్ హయంలో ప్లాంట్ లాభాల్లో ఉంది.

రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయే సరికి ప్లాంట్ ను నీరు గార్చారు. అంచెలంచెలుగా ప్లాంట్ ను దెబ్బ తీశారు. ఇది చాలా దుర్మార్గం. 32 మంది బలిదానాలు తో ప్లాంట్ ఏర్పడింది. ఎంతో మంది భూములు స్వచ్చందంగా ఇచ్చారు. విశాఖ కు సొంత మైన్ లేదు. ప్లాంట్ కి ఇచ్చే ముడిపదార్ధాలు ధరలు పెంచారు. పాలకులు సిక్ ఇండస్ట్రీ గా మార్చారు. అవిటి ప్రాజెక్టు, కుంటి ప్రాజెక్టు గా చిత్రీకరిస్తున్నారు. నష్టాల సాకు చూపి అమ్మాలని చూస్తున్నారు. ఆదుకొనే చిత్తశుద్ధి ఎవరికీ లేదు. కాంగ్రెస్ హయంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఈ ప్లాంట్ విస్తరణ చేశారు. 3 మిలియన్ టన్నుల సామర్థ్యం నుంచి 7 మిలియన్ టన్నులు పెంచారు. 20 మిలియన్ టన్స్ కి పెంచేలా బ్లూ ప్రింట్ రెడీ చేశారు. ఒకప్పుడు 7 మిలియన్ టన్స్ ఉత్పత్తిచేసే ప్లాంట్ నీ 1 మిలియన్ టన్స్ కి తగ్గించారు. ఉత్పత్తి తగ్గడానికి ఈ పాలకులే కారణం. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా పట్టించుకోలేదు. జగన్ కి నష్టాల్లో ఉన్నట్లు తెలియదట. బాబు హామీ ఇచ్చాడట..కానీ అమలు కాలేదు. విశాఖ భూముల మీద మోడీ కన్ను పడింది. కార్మికులు గత 13 వందల రోజులుగా చేస్తున్న దీక్ష ప్రభుత్వాలకు కనిపించడం లేదు.

ఇద్దరు కార్మికులు కూడా చనిపోయారట
కేంద్రంతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కి ఎందుకు సంబంధం ఉండదు? భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు కి ఉంది. వైఎస్ఆర్ హయంలో విశాఖ ప్లాంట్ కోసం అనంతపురం లో ఒక మైన్ కూడా ప్లాన్ చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత సొంత మైన్ ఇచ్చే భాధ్యత ను కేంద్రం మరిచింది. వైఎస్ఆర్ మరణం తర్వాత ఎవరికి ప్లాంట్ కష్టాలు పట్టలేదు. విశాఖ సెంటిమెంట్ తో కూడిన ప్లాంట్ అన్నారు. సెంటిమెంట్ అయితే 4 వేల మందిని ఎలా తీసేశారు. 30 ఏళ్ల నుంచి పని చేస్తున్న వాళ్ళు సెంటిమెంట్ కాదా? విశాఖ స్టీల్ కష్టాలు పట్టని కేంద్రంతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు. బాబు, పవన్ సమాధానం చెప్పాలి. ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి. చంద్రబాబు, పవన్ తక్షణం ఇక్కడకు రండి. కార్మికులకు భరోసా ఇవ్వండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఒకరి మీద ఒకరు నెపం మోపకండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలి.

విశాఖ ప్రైవేటీకరణ ఆపాలి
విశాఖ ప్లాంట్ కి నిధులు కేటాయించాలి. సొంత మైన్ ఇవ్వాలి. విధుల నుంచి తొలగించిన 4 వేల మందికి తక్షణం ఉద్యోగాల్లోకి తీసుకోండి. 14 వేల మంది కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి. సెయిల్ లో విలీనం చేయాలి. మా డిమాండ్లు పరిష్కరించకపోతే ఇదే ప్లాంట్ ఆవరణలో షర్మిలా రెడ్డి దీక్ష చేస్తుంది. అవసరం అయితే రాహుల్ గాంధీని కూడా తీసుకు వద్దాం.

LEAVE A RESPONSE