Suryaa.co.in

Telangana

రైతన్నలు పడుతున్న గోస చూడాలి

– తుమ్మలది తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది
– బీజేపీ లో కాదు కాంగ్రెస్ లోనే కుర్చీల కోసం కుమ్ములాటలు
– బీజేపీ ప్రజా ప్రతినిధుల పక్షాన రైతులు ఆదుకోవాలని , వారికి భరోసా కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ విడుదల చేసిన మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి రాజ్యంలో గోసడుతున్న రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. మహేశ్వర్‌రెడ్డి లేఖ పూర్తి పాఠం ఇదీ.

బీజేపీ రైతులకు అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించాం. కాంగ్రెస్ అరాచక ప్రభుత్వం ను నడిపిస్తుంది. దుర్మార్గపు పాలన చేస్తున్న కాంగ్రెస్ మెడలు వంచేలా కార్యక్రమాలు చేపడతాం. రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం తో రైతన్నలు పడుతున్న గోస చూడాలి.

వడ్లకు బోనస్ ఇవ్వడం లేదు.. ఇతర పంటలకు ఇస్తానన్న బోనస్ మర్చిపోయారు. మా దీక్ష తో తుప్పు తెలుసుకుని రైతులకు మంచి చేస్తారు అనుకున్న.తుమ్మల నాగేశ్వరరావు ది తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. ఆయన పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ఢిల్లీ కాంగ్రెస్ లో అయనకు పెద్దగా పట్టులేదు.హామీలను నెరవేర్చకుండా ఉన్న ప్రభుత్వ వైఫల్యాలు తుమ్మల నాగేశ్వరరావు పై పడుతోంది.
కేంద్ర ప్రభుత్వం ఎరువులకు 20వేల పై చిలుకు సబ్సిడీ ఇస్తుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ బీజేపీ పార్టీ.మహారాష్ట్రలో యూపీ లలో ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేశాం. తప్పుడు హామీలను ఇచ్చి గద్దె నెక్కదలచుకోవడం లేదు.

13 వేల కోట్ల రుణమాఫీ ఎప్పటి వరకు అకౌంట్ లలో వేస్తారు. 2 లక్షల వరకు మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ది.వెంటనే రైతుల ఖాతాలో రుణమాఫీ జిమ్ చేయాలి. 17933 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేశారో లిస్ట్ విడుదల చేయాలి. మిగిలిన రైతులు ఎంత మంది ఉన్నారు వారికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారో చెప్పాలి.

రైతులకు మూడు లక్షల వడ్డీ లేని రుణాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని మరచి పోయాడా? బీజేపీ లో కాదు కాంగ్రెస్ లోనే కుర్చీల కోసం కుమ్ములాటలు ఉంటాయి. నిన్న మేం చేపట్టిన దీక్ష లో మా ప్రజా ప్రతినిధులం అందరం పాల్గొన్న సంగతి చూడలేదా?

LEAVE A RESPONSE