హైకోర్టు ఆదేశించినా బిల్లులివ్వలేదు
– చంద్రబాబు కి రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి
అమరావతి: గతంలో చేసిన ఉపాథి హామీ పనుల బకాయి బిల్లులను చెల్లించేలా ఆదేశించాలని మాజీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు బాబూ రాజేంద్రప్రసాద్ సీఎం చంద్రబాబునాయుడును కోరారు.
ఆ మేరకు బాబును కలిసిన ఆయన.. 2018- 19 సంవత్సరంలో చేసిన ఉపాధి హామీ పనుల పాత బకాయిలను చెల్లించాలని, అలాగే ఆ బకాయిలు చెల్లించాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేసిన అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు .
ఈ అంశాలపై సానుకూలంగా స్పందించి.. త్వరలోనే బిల్లులు చెల్లించడమే కాకుండా, చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.