Suryaa.co.in

Andhra Pradesh

పింఛన్లకు రూ.1,570 కోట్లు విడుదల

అమరావతి: రాష్ట్రంలో జనవరి 1 నుంచి చేపట్టే పింఛన్ల పంపిణీ కోసం రూ.1,570.60 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రూ.2,250 నుంచి రూ.2,500కి పెంచిన పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒకటో తేదీన గుంటూరు జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61.75 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. జనవరిలో కొత్తగా 1.41 లక్షల మందికి మంజూరు చేసినట్లు వెల్లడించారు. పంపిణీ కార్యక్రమాన్ని 1 నుంచి 5 రోజులపాటు పండగలా నిర్వహిస్తామని, అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంపిణీలో భాగస్వాములవుతారని వివరించారు.

LEAVE A RESPONSE