హైదరాబాద్ : కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్కు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో కమలాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది.
2023లో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఈ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇందులో బండి సంజయ్ పేరును ప్రధాన నిందితుడిగా కమలాపురం పోలీసులు చేర్చారు. కేసు నమోదులో సరైన సెక్షన్లు కానీ.. దర్యాప్తులో పూర్తి వివరాలు కానీ లేవని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ కేసును కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుపై సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో తనను ప్రభుత్వం కేసులు, జైళ్లతో వేధించిందని విమర్శించారు.