యశోద సినిమాలో కనిపించిన ఇవా ఆసుపత్రికి సంబంధించిన సన్నివేశాలను తొలగించమని యశోద సినిమా నిర్మాత శివలంక కృష్ణ ప్రసాద్ అన్నారు. ఇవ పేరుతో ఆసుపత్రి ఉన్న విషయం తమకు అసలు తెలియదని అన్నారు. మంగళవారం ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత శివలంక కృష్ణ ప్రసాద్ తో పాటు ఇవ ఆసుపత్రి అధినేత మురళి మోహన్ మాట్లాడారు. ఇవ ఆసుపత్రికి యాజమాన్యం యశోద సినిమాలో ఆసుపత్రికి సంబధించిన సన్నివేశాలను తొలగించాలని కోర్టుకు వెళ్లారని నిర్మాత తెలిపారు. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం ఆయా సన్నివేశాలను తొలగించమని చెప్పారు. భవిష్యత్తులో ఓ టి టి లో కూడా ఇవ ఆసుపత్రికి సంబధించిన సన్నివేశాలు కనిపించవని పేర్కొన్నారు. సెన్సార్ నిబంధనల ప్రకారం అన్ని సన్నివేశాలను తొలగించమని చెప్పారు.
ఇవ ఆసుపత్రి అధినేత మురళి మోహన్ మాట్లాడుతో నేరుగా నిర్మాతల దగ్గరికి వస్తే సన్నివేశాలను తొలగిస్తారో లేదో అనే అనుమానంతో తాము కోర్టును ఆశ్రయించామని అన్నారు. తాము వేసిన అయిదు కోట్ల రూపాయల పరువు నష్టం దావాను కూడా వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. యశోద సినిమా మొత్తం మెడికల్ వ్యవస్థకు నెగెటివ్ గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కడో ఒకచోట తప్పు జరిగితే ఆ తప్పును అన్ని ఆసుపత్రులకు రుద్దటం సరైంది కాదని అన్నారు.