జనసేన పార్టీ విధానాలను విమర్శిస్తే దాడులు చేస్తారా ?

పవన్ కళ్యాణ్ వైఖరిని విమర్శిస్తే హత్యలు చేస్తారా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారని రాష్ట్రంలో దాడులు మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ అభిమానులు. నిన్న కడప లోని పెండ్లిమర్రి మండల పరిధి లోని యోగివేమన యూనివర్సిటీ దగ్గర జనసేన విధానాలను విమర్శించారనే కారణంతో కడప పట్టణంలోని శ్రీమతి బసవ రామ తారకం న్యాయ కళాశాలలో చదువుకునే హర్ష రాయల్ అనే న్యాయ విద్యార్థి తన అనుచరులతో వై.సి.పి ఆరోగ్య విభాగం నాయకులు, డాక్టర్ వైయస్సార్ సంజీవిని చైర్మన్ డాక్టర్ సింగనమల సుమన్ కారును అడ్డగించి దాడికి దిగి, హత్యాయత్నం చేశారు. ఎడమ చేతి కి కత్తి గాయం అవడంతో హుటాహుటిన కడప రిమ్స్ కు వెళ్లి, చికిత్స తీసుకుని ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయాన్ని కడప ఎస్పీకి తెలియజేయగా సంఘటన జరిగిన పరిధిలోని పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సంఘటన నేపథ్యంలో డాక్టర్ సింగనమల సుమన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పరిపాలనను, వై.యస్.ఆర్.సి.పి విధానాలను విమర్శించడానికి ఏమీ లేకపోవడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సహనం కోల్పోయి వై.సి.పి నాయకులకు మీడియా ముందే చెప్పు చూపించడం, వై.యస్.ఆర్.సి.పి నాయకులను ఇళ్ళల్లోనుంచి బయటికి లాగి కొడతాం అని రెచ్చగొట్టుడు మాటలు మాట్లాడటం వల్లే జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలాంటి దాడులకు దిగుతున్నారని ఆయన అన్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలను వారి విధానాలను విమర్శిస్తారని, విమర్శలకు తట్టుకోలేనప్పుడు పార్టీలను మూసేసుకోవాలని అన్నారు. ఇలాంటి వారిపై పోలీసులు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఇదే తరహా దాడులు మరింత మంది వైసిపి కార్యకర్తల పై జరగొచ్చని ఆయన అన్నారు.

Leave a Reply