Home » పేరును మార్చడం తనకు బాధ కలిగించింది

పేరును మార్చడం తనకు బాధ కలిగించింది

– నందమూరి కల్యాణ్ రామ్

విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైయస్సార్ పేరును ఏపీ ప్రభుత్వం పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నారు. ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తాజాగా తారక్ అన్నయ్య నందమూరి కల్యాణ్ రామ్ స్పందించారు.

ట్విట్టర్ ద్వారా కల్యాణ్ రామ్ స్పందిస్తూ… 1986లో విజయవాడలో మెడికల్ యూనివర్శిటీని స్థాపించారని చెప్పారు. ఏపీలోని మూడు ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న ఎన్టీఆర్ గారు ఈ మహా విద్యాలయానికి అంకురార్పణ చేశారని తెలిపారు. ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెంది, లెక్కలేనంత మంది వైద్య నిపుణులను దేశానికి అందించిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు ఈ విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు మార్చారని తెలిపారు.

ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం తనకు బాధ కలిగించిందని కల్యాణ్ రామ్ చెప్పారు. కేవలం రాజకీయల లాభం కోసం అనేక మంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు అని అన్నారు.

Leave a Reply