ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని కలిసిన ‘అదానీ గ్రీన్ ఎనర్జీ’ ప్రతినిధులు
– అనంతపురంలోని రాయదుర్గంలో ప్రాజెక్టు ఏర్పాటుకు భూముల పరిశీలన
అమరావతి, జూన్ 28: ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డితో ‘అదానీ గ్రీన్ ఎనర్జీ’ ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుపై ఆయనతో ప్రధానంగా చర్చించారు. 1000 నుంచి 2000 మెగా వాట్ల సామర్థ్యం గల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబర్చినట్లు ఛైర్మన్ వెల్లడించారు. రాయదుర్గంలో సౌరవిద్యుత్ ఏర్పాటుకు గల అవకాశాలను , వనరుల గురించి గ్రీన్ ఎనర్జీ ప్రతినిధులతో ఛైర్మన్ చర్చించారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి గ్రీన్ ఎనర్జీ ప్రతినిధులతో కలిసి ఆ ప్రాంతంలో భూములను పరిశీలించారు.
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు వస్తే సీమకు పారిశ్రామిక వెలుగులు వచ్చినట్లేనని ఆయన పేర్కొన్నారు. రాయదుర్గంలోని ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి నివాసంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, కళ్యాణదుర్గం ఆర్ డి ఓ నిశాంత్ రెడ్డి, రాయదుర్గం తహసిల్దార్ మారుతి, డిప్యూటీ తహసిల్దార్, బాలకిషన్ నెడ్ క్యాప్ అనంతపురం జిల్లా మేనేజర్ కోదండ రామ మూర్తి, ఫీల్డ్ ఆఫీసర్ వరప్రసాద్, గ్రీన్ ఎనర్జీ ప్రతినిధులు జైమిన్ గాంధీ, పటేల్ కేతన్, రాకేష్ చంద్ర, అనిల్ కుమార్, యాదవ్ తదితరులు పాల్గొన్నారు.