Suryaa.co.in

Andhra Pradesh

పరిశోధనలు ప్రగతికి సోపానాలు

– ‘విష్ణు’ క్యాంపస్లో గో కార్ట్ ట్రాక్ ప్రారంభం

భీమవరం: విద్యార్థి దశలో పరిశోధనలు భవిష్యత్తులో ప్రగతికి సోపానాలుగా నిలుస్తాయని సియిండియా వెస్టర్న్ సెక్షన్ సీనియర్ డైరెక్టర్, హెడ్ ఎన్.సంజయ్ సుధాకర్(ముంబయి), ఆల్జర్ ఇంజినీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చీరాల పాండురంగారావు అన్నారు.

భీమవరంలోని విష్ణు క్యాంపస్ లో విష్ణు ఎటీవీ, గో కార్ట్ ట్రాకను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెకానికల్, ఎలక్ట్రికల్ లో ఉద్యోగావకాశాలు తక్కువగా ఉన్నాయని, కెమికల్ ఇంజినీరింగ్ లో ఎన్నో ఉద్యోగావకాశాలున్నాయని, నూతన ఆలోచనలతో సరికొత్త పరిశోధనలు చేయవచ్చని తెలిపారు. అన్నారు. ఈ ప్రాంతంలో 2 ఎకరాల విస్తీర్ణంలో గో కార్టు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కేవీ విష్ణురాజు మాట్లాడుతూ 2015లో విష్ణు క్యాంపస్ లో ఆటో మోటిమన్ను ఏర్పాటు చేశామని, 2018లో విద్యార్థులకు గో కార్ట్ లో పోటీలు నిర్వహించామని, నూతన క్యాంపస్ 2 ఎకరాల విస్తీరణలో విద్యా ర్థుల కోసం గో కార్ట్ ట్రాక్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. 2 రకాల
college1 వెహికల్స్ ఏర్పాటు చేశామని, ఎటీవీ, గో కార్ట్ వంటివి వెహికతో విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నామని, త్వరలో పరిసర ప్రాంతాల విద్యార్థులకు కూడా ఈ సదుపాయాన్ని అందిస్తామని తెలిపారు.

మధ్యప్రదేశ్ ఇండోర్ లో ప్రతి ఏడాది విద్యార్థులకు గో కార్ట్ పోటీలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. త్వరలో ఎలక్ట్రికల్ వెహికలను ఏర్పాటు చేస్తా మని తెలిపారు. అనంతరం మూడో సంవత్సరం మెకానికల్ విద్యార్థులు హన్సిక, సాధ్య, లక్ష్మి, కావ్యలు గో కార్ట్ వెహికలను రైడ్ చేశారు. కార్యక్ర మంలో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ కె.ఆదిత్య, విష్ణుమహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జి.శ్రీ నివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ పేరిచర్ల శ్రీనివాస్ రాజు, ఎజీఎం రమేష్ రాజు, వివిధ శాఖల హెడ్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE