Suryaa.co.in

Telangana

నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ దుర్మార్గపు అణచివేత

– బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

“ఓయూలో తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థుల వెంటపడి మరీ పోలీసులు అరెస్ట్ చేసి ఈడ్చుకు వెళ్తున్నారు. తెలంగాణ బిడ్డలకు ఎన్నికల ముందు ఆశలు చూపి అధికారం లోకి వచ్చిన మరుక్షణం నుండే అణచివేతకు పాల్పడుతున్న రేవంత్ సర్కార్ మీద నిరుద్యోగ యువత భగ్గు మంటున్నారని” బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేయగా బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రీ-ట్వీట్ ని షేర్ చేశారు.

 

LEAVE A RESPONSE