– ఇప్పుడు తెలంగాణలో రేవంతే పెద్ద నటుడు
-రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కూడా నటిస్తున్నారు
– తమిళ నాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వ్యంగ్యాస్త్రాలు
ఢిల్లీ: ‘‘తెలంగాణలో సూపర్‌స్టార్ కోసం సీఎం రేవంత్‌రెడ్డి హీరో అల్లు అర్జున్‌తో పోటీ పడుతున్నారు. అసలు ఇప్పుడు ఆయనే అక్కడ పెద్ద నటుడు’’ అని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
జాతీయ మీడియాతో మాట్లాడిన అన్నామలై.. సంధ్య థియేటర్ ఘటనలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు సరైంది కాదని, ఆయనెక్కడా తటస్థత ప్రదర్శించలేదని విమర్శించారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కూడా నటిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో ప్రధాన నటుడు ఆయనేనని చురక అంటించారు. సంధ్య థియేటర్ ఘటన రాజకీయ రంగు పులుముకుందని, ఒకరిని బలిపశువును చేయడం, వేధించడం సరికాదన్నారు.ప్రధాని నరేంద్రమోదీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం పట్ల అన్నామలై హర్షం వ్యక్తం చేశారు.