Suryaa.co.in

Telangana

రేవంత్.. రేవతి చావులో నీ పాత్ర లేదా?

– ఏమైనా సైకోలాజికల్ ప్రాబ్లమ్ ఉందా?
– బెనిఫిట్స్ షోస్ కి పర్మిషన్ ఇచ్చిందే నువ్వు.
– ముఖ్యమంత్రి ఎక్స్ గ్రేషియా ఎందుకు ఇవ్వడు?
– బీఆర్ఎస్ నేతలు డాక్టర్ దాసోజు శ్రవణ్,పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్: అసెంబ్లీ అనేది పవిత్రమైన ప్రజాస్వామ్య దేవాలయం. న్యాయం, ధర్మం, రాజ్యాంగ నిబద్దత ఉట్టిపడే విధంగా ఆదర్శవంతంగా ఉండాలి. ప్రజాస్వామ్య దేవాలయంలో నిలబడి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతు భరోసా అందక రుణమాఫీ కాకపోవడంతో అన్నమో రామచంద్ర అని రైతులు అంటున్నారు.

నిరుద్యోగ అంశం పైన చర్చ లేదు. బిసి లు, ఎస్ సి, ఎస్ టి లు అందరూ బాధపడుతున్న సమయం. అదానీ లాంటి దోపిడీదారుల పైన చర్చలేదు. గురుకులాలు విద్యార్థులు పైన లోతైన చర్చ లేదు. తాను చెప్పిందే వేదం అన్నట్టు రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు.లగచర్ల అంశం పైన చర్చలేదు.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఏమైనా చరమగీతం పాడారా ? కోర్ట్ లో ఉన్న విషయాలను అసెంబ్లీ లో చర్చ ఎలా చేస్తారు? అల్లు అర్జున్ పైన ఏ కుట్ర ఉందో తెలియడం లేదు. అల్లు అర్జున్ ని లొంగదీసుకోవాలని చూస్తున్నారు. భార్య చనిపోయిన భర్త బాధ, బిడ్డ ఆసుపత్రిలో ఉన్న బాధను అర్ధం చేసుకోగలం. ఒక్క రూపాయ ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు రేవంత్ రెడ్డి చెప్పు.

అంత మొసలి కన్నీరు కారుస్తున్న ముఖ్యమంత్రి ఎక్స్ గ్రేషియా ఎందుకు ఇవ్వడు? ప్రైవేట్ ఫౌండేషన్ నుంచి కోమటిరెడ్డి సహాయం ఎలా ఇస్తారు? నువ్వు ఎందుకు ఇవ్వవు చెప్పు రేవంత్ రెడ్డి? రేవతి చావులో నీ పాత్ర లేదా? బెనిఫిట్స్ షోస్ కి పర్మిషన్ ఇచ్చిందే నువ్వు. రేవతి ప్రాణాలను కాపాడలేని వాడివి నువ్వు. రేవంత్ రెడ్డి చట్టానికి విరుద్ధంగా మాట్లాడిండు .

గంట గంటన్నర సేపు మాట్లాడినవు అల్లు అర్జున్ అంశం, ఒక్క వ్యక్తిని తూలనాడడం కోసం సభలో మాట్లాడతావు. దీని వలన కోటి వరకు ఖర్చు అవుతుంది. దురదృష్టకర సంఘటన అని చాలా హుందాగా చెప్పాడు అల్లు అర్జున్. ఆ కుటుంబాన్ని ఆధుకుంటాను అని చెప్పారు.

రూల్స్ కి విరుద్ధంగా చర్చ జరిపారు. సినిమా ఇండస్ట్రీ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏమైనా సైకోలాజికల్ ప్రాబ్లమ్ ఉందా? అసెంబ్లీ లో పనికిరాని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? లగ చర్ల విషయంలో తప్పుదారి పట్టిస్తున్నావు. ఫ్యూడిలిజంతో నడుస్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు ఓడిపోయాన చోటనే నిన్ను గెలిపించిన బిడ్డలు రేవంత్ రెడ్డి.

రైతు బిడ్డలను జైలు పెట్టినావు. కోర్ట్ లో ఉన్న అంశాన్ని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు, అసెంబ్లీ లో ఎలా మాట్లాడాతావు? అన్ని అబాద్దాలు ఆడుతున్నావు రేవంత్ రెడ్డి. అప్పుల విషయంలో కూడా సభలో అబద్దాలు ఆడుతున్నారు. ప్రజలను పక్కాదారి పట్టిస్తున్నారు, ప్రజాస్వామ్యన్ని గౌరవించు. కేటీఆర్ పైన ఫార్ములా ఈ రేస్ పైన కేసు పెట్టడం జరిగింది, దీని పైన చర్చ పెట్టండి అని కేటీఆర్ స్పీకర్ ని అడిగారు.

కానీ సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసు కోర్ట్ లో ఉంది అని చర్చ చేయలేం అని చెప్పారు. లగ చర్ల, అల్లు అర్జున్ కేసు కోర్ట్ లో లేదా, మరి వీటి పైన ఎలా డిసైడ్ చేస్తావు? హైడ్రా విషయంలో ఒక్క బడా బాబుదైనా ఇల్లు కూల్చినవా రేవంత్ రెడ్డి? మళ్ళీ వెంటనే హైడ్రా కమిషనర్ కట్టిన ఇండ్లు కూలగొట్టం అంటాడు. అల్లు అర్జున్ ని జైల్లో పెట్టిన … కేటీఆర్ ని పెట్టలేనా అని ఒక్క చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ నేత ఫయాజ్ కూడా పాల్గొన్నారు.

LEAVE A RESPONSE