Suryaa.co.in

Telangana

రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదవకుంటే అర్జున్ రియల్ హీరో అయ్యేవాడు

– వివాదాలను కొనసాగించాలని ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు
– యూపీ లో స్వామీజీ ప్రోగ్రాం తొక్కిసలాటలో 100 మంది చనిపోయారు
– పీఎం రిలీఫ్ ఫండ్స్ నుండి కోటి రూపాయలు బాధిత కుటుంబానికి ఎందుకు ఇప్పించలేదు?
– భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను బీజేపీ జాతీయ నేతల నుండి రాష్ట్ర నేతల వరకు ప్రొలాంగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. యూపీ లో స్వామీజీ ప్రోగ్రాం తొక్కిసలాటలో 100 మంది చనిపోయారు. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.

ఇండస్ట్రీలో సమస్యలు తెలుస్తాయని దిల్ రాజుకు ఫిల్మ్ డేవలప్మెంట్ కార్పొరేషన్ పదవి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి అయింది. ఫిల్మ్ ఇండస్ట్రీకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ పై, ఫిల్మ్ ఇండస్ట్రీపై ఎలాంటి కోపం లేదు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిండు. మహిళ ప్రాణాలు కోల్పోయి ఉంటే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నారు.

రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదవకుంటే అల్లు అర్జున్ రియల్ హీరో అయ్యేవాడు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. బీజేపీ పురంధేశ్వరి దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదని అంటున్నారు. బండి సంజయ్,పురంధేశ్వరి,అశ్విని వైష్ణవ్, లక్ష్మణ్ పీఎం రిలీఫ్ ఫండ్స్ నుండి కోటి రూపాయలు బాధిత కుటుంబానికి ఎందుకు ఇప్పించలేదు? అల్లు అర్జున్ తప్పులేదని అంటున్నారు. మహిళ చావుకు ఎవరు కారణం? దిల్ రాజ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఇండస్ట్రీలోనే ఉంటాడు. వివాదాలను కొనసాగించాలని ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు.

LEAVE A RESPONSE