Suryaa.co.in

Telangana

ఖర్గే నే అవమానించిన రేవంత్ కాంగ్రెస్ కు దళితగిరిజనుల గురించి మాట్లాడే హక్కు లేదు

-ఎమ్మెల్సీ, హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఇన్చార్జి దాసోజు శ్రవణ్‌

సిడబ్ల్యుసి మెంబెర్ అయిన దామోదర్ రాజ నరసింహ కి గాంధీ భవన్ లో కనీసం సన్మానం చేయకుండా అవమానించిన రేవంత్ కాంగ్రెస్ కు, దళితగిరిజనుల గూర్చి మాట్లాడే హక్కు లేదు. సీఎల్పీ నేతభట్టి విక్రమార్క పాదయాత్రను పొంగులేటి పాలపొంగుతో పరేషాన్ చేసి అవమానించిన రేవంత్ కాంగ్రెస్ కు దళితగిరిజనుల గూర్చి మాట్లాడే హక్కు లేదు.

కేంద్ర మంత్రిగా పని చేసి తెలంగాణ కోసం పార్లమెంటులో కొట్లాడిన సర్వే సత్యనారాయణ ని కుంటిసాకులతో పీకి పడేసి అవమానించిన రేవంత్ కాంగ్రెస్ కు దళిత గిరిజనుల గూర్చి మాట్లాడే హక్కులేదు.

కురువృద్ధ మహిళా నేత గీతా రెడ్డి గారు, 50 ఏళ్లుగా గాంధీ సిద్ధాంతాలతో, క్రమశిక్షణ గల నేతగా, ఎమ్మెల్యే గా, మంత్రిగా, సిఎల్పీ నేతగా, మహిళ కాంగ్రెస్ చీఫ్ గా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తే చివరకు ఆమెకు వ్యతిరేకంగా, జహీరాబాద్ టికెట్ కోసం ప్రత్యర్థులను రెచ్చగొట్టి ఆమెను అనారోగ్యానికి గురి చేసి బెడ్ కు పరిమితం చేసిన రేవంత్ కాంగ్రెస్ కు దళితగిరిజనుల గూర్చి మాట్లాడే హక్కు లేదు.

కేంద్ర మంత్రిగా పనిచేసిన జాతీయ స్థాయి లంబాడ నేత బలరాంనాయక్ కి కనీస గౌరవం లేదు.. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవే కాదు, ఏ ఒక్క పదవి కూడా ఇవ్వకుండ అవమానించి, పది పార్టీలు మారిన పెద్దమనిషి కి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిన రేవంత్ కాంగ్రెస్ కు దళితగిరిజనుల గూర్చి మాట్లాడే హక్కు లేదు.

మాదిగ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ కురువృద్ధ దివంగత నాయకుడు నంది ఎల్లయ్య ని కనీసం మంత్రిని చెయ్యలేదు . దాదాపు 60 ఏళ్లకు పైగా ఎంపీ గా గాంధేయ సిద్ధాంతంతో పనిచేసిన ఆయన చనిపోతే గాంధీ భవన్ లో కనీసం సంతాప సభ పెట్టలేదు.2014 లో ఎంపీగా గెలిస్తే 2018 లో అకారణంగా టికెట్ ఇవ్వలేదు.. అయన తీవ్ర అవమానంతో చనిపోవడానికి కారకులైన రేవంత్ కాంగ్రెస్ కు దళితగిరిజనుల గూర్చి మాట్లాడే హక్కు లేదు.

దామోదరం సంజీవయ్య గారిని ను దగా చేసిన కాంగ్రెస్ కు దళితగిరిజనుల గురించి మాట్లాడే హక్కు లేదు.దళిత గిరిజన నాయకత్వాన్ని పెంపొందించే Leader Development Mission in Reserved Constituencies (LDMRC) ను అమలు చేయకుండా దళిత గిరిజన అభ్యుదయాన్ని అడ్డుకున్న ఫ్యూడల్ రేవంత్ కాంగ్రెస్ కు దళితగిరిజనుల గూర్చి మాట్లాడే హక్కు లేదు.

దళిత గిరిజన నాయకులను, ఎమ్యెల్యే లను బానిసలుగా చూసే ఫ్యూడల్ వ్యవస్థ నడిపే రేవంత్ కాంగ్రెస్ కు దళితగిరిజనుల గూర్చి మాట్లాడే హక్కు లేదు.కాంగ్రెస్ లో దళితగిరిజన అగ్ర నేతలకే అడ్రెస్ లేదు.. మీరు డిక్లరేషన్లతో పేద దళితులను దగా చేస్తారా??

డజను అంశాల డిక్లరేషన్ కాదు..
5 డజన్ల ఏళ్ళ పాలనలో దళిత, గిరిజన సంక్షేమం గురించి మీరు ఆలోచిస్తే ఈ డికరేషన్ల లొల్లి ఇప్పుడెందుకు?గురువింద క్రింద నలుపు సామెత తమరికి వర్తిస్తుంది..

LEAVE A RESPONSE