– సీఎం రేవంత్ రెడ్డి ,శివధర్ రెడ్డి పై కేసు బుక్ చేయాల్సిందే
– రేవంత్ దేవుళ్ళ మీద ఒట్లు వేయడం వల్లే రాష్ట్రం లో భూ కంపం
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హైదరాబాద్: బంజారాహిల్స్ ఏసీపీ కి పొద్దునే ఫోన్ చేస్తే మధ్యాహ్నం 3 గంటలకు రమ్మన్నారు. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళేకన్నా ముందే ఏసీపీ వెళ్లిపోయారు. సీఐ కూడా వెళ్లి పోయేందుకు ప్రయత్నిస్తే మా పార్టీ కార్యకర్తలు ప్రశ్నించారు. నేను ఎమ్మెల్యే అని గౌరవం లేకుండా సీఐ ప్రవర్తించారు. డీజీపీ కన్నా ఎక్కువ ప్రోటో కాల్ ఎమ్మెల్యే కు ఉంటుందని సీఐ కి తెలియదా ? ఏ ప్రజాప్రతినిధి కానీ సీఎం సోదరులకు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారు. చివరకు బంజారాహిల్స్ పి ఎస్ సీఐ కి నా పిర్యాదు నిచ్చి రసీదు తీసుకున్నా.
నా ఫోన్ ట్యాప్ అవుతుంది అనేది నా ప్రధాన ఆరోపణ. సీఎం రేవంత్ రెడ్డి ,ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. నేను ఓ మిత్రుడి పార్టీ కి వెళితే శివధర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి అక్కడికి పోలీసులను పంపించారు. నా దగ్గర డ్రగ్స్ పెట్టించి కేసు పెట్టించాలని శివధర్ రెడ్డి ప్రయత్నించారు.
కచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ,శివధర్ రెడ్డి పై కేసు బుక్ చేయాల్సిందే ..ఎఫ్ .ఐ .ఆర్ .నమోదు చేయాల్సిందే. మా నేత హరీష్ రావు పై బ్రోకర్ రేవంత్ రెడ్డి సూచనతో బ్రోతల్ చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు. బ్రోకర్ ,బ్రోతల్ లు కేసు పెడితే పోలీసులు హరీష్ రావు పై ఎఫ్ ఐ ఆర్ ఎలా నమోదు చేస్తారు ? హరీష్ రావు పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తే నా కేసు విషయం లో సీఎం రేవంత్ ,డీజీపీ ,ఇంటెలిజెన్స్ ఐజీ పై కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాల్సిందే. నేనిచ్చిన పిర్యాదు పై ఎఫ్ ఐ ఆర్ చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు.
మా అగ్ర నేతలందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. సీఎం రేవంత్ దేవుళ్ళ మీద ఒట్లు వేయడం వల్లే రాష్ట్రం లో భూ కంపం వచ్చింది. సీఎం పాపాల నుంచి ప్రజలను దేవుళ్ళే కాపాడాలి. వచ్చేది మా ప్రభుత్వమే ..చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్న పోలీసులపై చర్యలు తప్పవు.