Suryaa.co.in

Telangana

గురుకుల విద్యార్థుల గోస ప్రభుత్వానికి పట్టదా?

– ఒకప్పుడు తెలంగాణ గురుకుల పాఠశాలలో సీటు కోసం ఎగబడ్డ తల్లిదండ్రులు
– నేడు గురుకుల పాఠశాలలకు తమ పిల్లలను పంపించాలంటే భయపడే పరిస్థితి
– బీఆర్‌ఎస్ నేత ఏనుగు రాకేష్‌రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యార్థులు పాఠశాలలో కంటే ఆసుపత్రులలోనే ఎక్కువ ఉంటున్నారు. మనదైతే మంగళవారం మంది అయితేఆదివారం అనే తీరులో ముఖ్యమంత్రి ఎందుకు ప్రవర్తిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్రమ అరెస్టులపై ఎప్పటికప్పుడు గొంతు చించుకున్న ముఖ్యమంత్రి నేడు రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఎందుకు ఈ అక్రమ అరెస్టులు నిర్బంధాలను ప్రోత్సహిస్తున్నారు.

ప్రభుత్వంగా మీరు గురుకుల విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైతే ప్రధాన ప్రతిపక్షంగా టిఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో విద్యార్థుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎందుకు ఉలిక్కిపాటు ఎందుకు? ఎందుకు ఈ అడ్డగింతలు నిర్బంధాలు అరెస్టులు? గురుకుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించే సత్తా లేని ప్రభుత్వం అక్రమ అరెస్టులతో కాలం వెళ్లదీస్తుంది.

ఒకప్పుడు తెలంగాణ గురుకుల పాఠశాలలో సీటు కోసం ఎగబడ్డ తల్లిదండ్రులు నేడు గురుకుల పాఠశాలలకు తమ పిల్లలను పంపించాలంటే భయపడే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరెస్టు శిఖరాలను అధిరోహించిన గురుకుల విద్యార్థులు కాంగ్రెస్ పాలనలో కలుషిత ఆహారం తిని హాస్పటల్ బెడ్డులు ఎక్కుతున్నారు.

రాష్ట్రంలో ఏదో ఒక మూల అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్ లో పాలవుతుంటే రాష్ట్ర మంత్రివర్గం ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యమంత్రి విజయోత్సవ సంబరాల పేరిట ప్రభుత్వ సొమ్ముతో జల్సా చేస్తుంది ప్రపంచస్థాయి విద్యాలయాలు నెలకొల్పుతానని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి కనీసం ఉన్న గురుకులాలనే కాపాడలేని పరిస్థితిలో ఉన్నాడు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయి విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఇంతవరకు సంక్షేమ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించలేకపోయారు.? ఢిల్లీకి హైదరాబాద్ కు తిరగడానికి మీకు సమయం సరిపోయిందా లేక ఢిల్లీకి డబ్బు మూటలు మోసే పనులు మంత్రివర్గాన్ని పూర్తిగా విస్తరించే పనిని మర్చిపోయారా.?

LEAVE A RESPONSE