Suryaa.co.in

Telangana

బిజెపికి తోకలా రేవంత్

-వైఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదా?
-జీవన్ రెడ్డి మాట మీద నిలబడాలి
-మోదీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడు
-కెసిఆర్ మల్లె పూవులా బయటకు వస్తారు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

మా పార్టీ ఎమ్మేల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ బిఆర్ఎస్ బి ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరారు. వారి సభ్యత్వం రద్దు కావాల్సి ఉంది. వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ ను సమయం కోరాం. ఈ రోజు లేదా రేపు సమయమిస్తానని స్పీకర్ చెప్పారు. గతంలో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు వీరిద్దరి సభ్యత్వాలు రద్దు కావాలి.

స్పీకర్ సమయం ఇస్తారని భావిస్తున్నాం. పాంచ్ న్యాయ్ తీర్మానం ప్రకారం ఫిరాయింపులు ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెబుతున్నారు. రాహుల్ బిజెపిపై దాడి చేస్తుంటే ఇక్కడ రేవంత్ బిజెపికి తోకలా వ్యవహరిస్తున్నాడు. మోదీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడు.

జీవన్ రెడ్డి మాట మీద నిలబడాలి. మేము ఏ ఒక్కరిని వదిలిపెట్టం. ప్రజల ముందు దోషిగా నిలబెడతం.స్పీకర్ న్యాయంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాం. రేవంత్ భయంలో ఉన్నాడు. కాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. పదవిని కాపాడుకోవటానికి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ.

రాజశేఖర్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదా? మా నాయకుణ్ణి మేము రోజు కలుస్తున్నం. హైకోర్టు తీర్పు తర్వాతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రావచ్చు. కమిషన్ విచారణ వద్దనటం లేదు..జస్టిస్ నరసింహ రెడ్డిని తప్పించాలని కోరుతున్నాం. విచారణలో అన్ని తేటతెల్లం అవుతాయి. కెసిఆర్ మల్లె పూవులా బయటకు వస్తారు.

LEAVE A RESPONSE