– భవిష్యత్ లో సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిరాక తప్పదు
– సినిమా పరిశ్రమ మీద దాడి ద్వేషంతోనే అర్జున్ ఇంటిమీద దాడి
– బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు
అమరావతి: అల్లు అర్జున్ ఇంటిమీద , తెలుగు సినిమా పరిశ్రమ మీద దాడి ద్వేషంతోనే. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలన వైపల్యాలను పక్కదారి పట్టించడంలో భాగంగా JAC ముసుగులో కాంగ్రెస్ చేస్తున్న దాడి. సమస్యను ప్రాంతాల మధ్య వైరం గా చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యం చెందిన ప్రతిసారి అల్లకల్లోలం సృష్టించడం పరిపాటి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మతకలహాలు, కుల ఘర్షణలు , ప్రాంత వైషమ్యాలు సృష్టించిన చరిత్ర. ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ , సినిమా పరిశ్రమ టార్గెట్ చేయబడుతున్నది. భవిష్యత్ లో సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిరాక తప్పదు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అయిన తెలంగాణ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్, టి. ఆర్. ఎస్. వారి పబ్బం గడుపుకోవడానికి ఆంధ్రుల మీద ద్వేషం నూరి పోస్తున్నారు.