Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి గా వున్న అంబేద్కర్ ను కాంగ్రెస్ రాజీనామా చేయించింది

– దేశ విద్రోహ శక్తులుగా రాహుల్, ప్రియాంక తయారయ్యారు
– అంబేద్కర్ ఆశయాలను పాటించేది బీజేపీ మాత్రమే
– కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పరాకాష్ట
– సభ్యసమాజం తల దించునేలా రాహుల్ ప్రవర్తన
– బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ

విజయవాడ: 75 సం స్వతంత్ర భారత దేశంలో ఎప్పుడూ చూడనటువంటి దారుణాలు గత వారం పార్లమెంట్ లో చూసాము. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ ఎప్పుడూ రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ను అవమానిస్తూనే ఉంది. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యతిరేకులుగా తయారయింది.

అంబేద్కర్ కి, రిజర్వేషన్లకి, ఓబీసీ లకు, పేదల పథకాలకు గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు. కుటిల రాజకీయాలతో దేశాన్ని ఎప్పుడూ మేమే పాలించాలి అని కాంగ్రెస్ చూస్తోంది. భారత దేశం ఆక్రమణకు గురి అయింది కాంగ్రెస్ వలన కాదా? రాజ్యాంగం అంటే రాహుల్ గాంధీ కి తెలుసా? గతంలో లోక్ సభ ఎన్నికలలో కూడా మోడీ, అమిత్ షా మాటలను AI ద్వారా మార్ఫింగ్ చేశారు. ఇప్పుడు అమిత్ షా వీడియో చూపించి బీజేపీ నీ బూచి గా చూపించడాన్ని ఖండిస్తున్నాం.

అంబేద్కర్ ను ఎన్నికలలో ఓడించినది కాంగ్రెస్ నేతలు కాదా? నెహ్రూ, ఇందిరాగాంధీ కి భారతరత్న స్వయంగా ప్రకటించుకుని, రాజ్యాంగ నిర్మాతకు మాత్రం భారత రత్న ఇవ్వకుండా అవమానించారు. 1990 లో బీజేపీ సహకారంతో ఏర్పడిన ప్రభుత్వం అంబేడ్కర్ గారికి భారతరత్న ఇచ్చింది. పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కూడా కాంగ్రెస్ సహకరించలేదు అంబేద్కర్ గారి 100 జయంతిని కూడా కాంగ్రెస్ తిరస్కరించింది. తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద వేలాది మెమోరియళ్లు ఏర్పాటు చేసుకున్న గాంధీ కుటుంబం, అంబేద్కర్ గారి గుర్తుగా ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు.

నరేంద్ర మోదీ అంబేడ్కర్ గారి విలువ మరింత పెరగడం కోసం పంచ తీర్థాలను స్థాపించారు. నవంబర్ 26 ను రాజ్యాంగ దినోత్సవంగా మోదీ ప్రకటించారు . దేశ విద్రోహ శక్తులుగా రాహుల్, ప్రియాంక తయారయ్యారు. మంత్రి గా వున్న అంబేద్కర్ ను రాజీనామా చేయించినది నాటి కాంగ్రెస్ పెద్దలు. అంబేద్కర్ ఆశయాలను పాటించేది బీజేపీ మాత్రమే బీజేపీ సిద్ధాంతమే .అంత్యోదయ.

దేశ విభజనకు కారణమై, లక్షలాది మందిని బలి తీసుకున్న కాంగ్రెస్, సిక్కులను వూచకోత కోసిన కాంగ్రెస్ పార్టీ హక్కుల గురించి మాట్లాడుతోంది. దేశంలో ఎమర్జెన్సీ తెచ్చి వేలాదిమందిని జైళ్ల పాలు చేసిన ఇందిరా గాంధీ వారసులు నేడు రాజ్యాంగం, హక్కులు గురించి మాట్లాడుతున్నారు.

ఓబీసీ రిజర్వేషన్ లకు వ్యతిరేకించిన రాజీవ్ గాందీ కాదా? మోదీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కాపాడుతున్నారు. మూడు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లు తీసుకొచ్చింది బీజేపీ అని తెలుసుకోవాలి. బీజేపీ నాయకుల పై కాంగ్రెస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేయడం ఖండిస్తున్నాం. సాటి మహిళా ఎంపీ నీ రాహుల్ గాంధీ తూలనడడం మహిళా నేతగా ఖండిస్తున్నాం. మరొక ఇద్దరు ఎంపీ లపై రాహుల్ చేసిన దాడిని ఖండిస్తున్నాం. సభ్య సమాజం తల దించునేలా రాహుల్ ప్రవర్తన.

LEAVE A RESPONSE