– బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మరపించాలని చూస్తున్నారు. గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
స్టాఫ్ నర్స్, కానిస్టేబుల్, గురుకులాల్లో ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇస్తే మేము ఇచ్చినట్టు బిల్డప్ కొడుతున్నారు.నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది ఉండకూడదు అని రోడ్డు డెవలప్మెంట్ ప్లానింగ్ లో భాగంగా జూబ్లీబస్టాండ్ నుంచి షామరీపెట్ వరకు స్కై ఎలేవేటర్ కారిడర్ ఏర్పాటు చేయాలని ఉద్దేశ్యంతో ఆనాడు కేంద్రప్రభుత్వం పెద్దలను కలసి విజ్జప్తి చేశారు కేసీఆర్ గారు, కేటీఆర్.
హైదరాబాద్ అభివృద్ధి కోసం ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అహార్నశలు కృషి చేశారు. ఆర్మీ అధికారులు అధీనంలో భూములు ఉంటే
ఆర్మీ అధికారులకు దీని కోసం వికారాబాద్ లో భూములు ఇవ్వడం జరిగింది.ఆనాడు ఆర్మీ అధికారులు కూడా ఒప్పుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మల్కాజీగిరి ఎంపీ గా ఉండి కూడా కారిడర్ కి సంబంధించిన భూములు గురించి ఎప్పుడు మాట్లాడలేదు. గాలికి ముఖ్యమంత్రి అయ్యుండు రేవంత్ రెడ్డి.