సి ఎం స్టేచర్ వున్నదని విర్రవీగుతున్నది రేవంత్ రెడ్డి తప్ప కేసీఆర్ కాదు.త్వరలో రాజకీయ మార్చురీకి పోయేది కూడా రేవంత్ మాత్రమే.ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి కేసిఆర్ ఏడాది నుండి రేవంత్ రెడ్డి ఎంత రెచ్చగొట్టినా,తన హోదాను మరిచి వీధి రౌడీలా అసభ్య పదజాలంతో దూషించినా కేసీఆర్ సహిస్తూ వున్నారంటే అది ఆయన బలహీనత కాదు-ఆయన రాజకీయ పరిపక్వత,హుందాతనానికి నిదర్శనం. శిశుపాలుని వందతప్పులు లెక్కించిన తర్వాతే కృష్ణుని చేతిలో కుక్క చావు చచ్చాడు.తెలంగాణ ప్రజలు ఓ అసమర్థునికి పట్టం కట్టారు.పిచ్చి కూతలు కూస్తే ప్రజలు ఊరుకోరు.
రవీంద్రభారతిలో రేవంత్ మాట్లాడుతూ తన దగ్గర డబ్బులు లేవని చెప్పడం ఆయన చేతగానితనానికి నిదర్శనం.కేసీఆర్ తన పదేళ్ళ పాలనలో ఏ రాష్ట్రం లో స్వాతంత్ర్యానంతరం భారతదేశం లో ఏ ముఖ్యమంత్రి కీ సాధ్యపడని ఆర్ధిక ప్రగతి ని సాధించి, తెలంగాణ ఆదాయాన్ని మూడు రెట్లు పెంచారు.ఆ ప్రగతి ని గమనించే వేలాది పారిశ్రామిక వేత్తలు తెలంగాణ లో పెట్టుబడులు పెట్టారు.
రేవంత్ గత పదిహేను నెలల పాలనలో తెలంగాణ ను పదేళ్లు వెనక్కి నెట్టారు.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ని తన అపరిపక్వత కారణంగా దిగజార్చి కేసీఆర్ పైన నెపాన్ని మోపి తప్పించుకోవాలనుకుంటున్నాడు.చేతకాని ముఖ్యమంత్రులను గద్దె దించడమే ఇప్పటివరకూ చూసాం కానీ నమ్మకద్రోహం చేసిన ముఖ్యమంత్రి ని పిచ్చి కుక్కలా తరిమే రోజు ఇంకెంతో దూరం లేదు.
-వీరమల్ల ప్రకాశ్
రాజకీయ విశ్లేషకులు