– మంత్రి మనోహర్
అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా మే నెల నుంచి పాఠశాలలు తెరిచే సమయానికి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి మనోహర్ పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులతో పాటు సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ సన్నబియ్యం అందించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 1లక్ష 14వేల మెట్రిక్ టన్నులు రైతులు నుంచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అధికార యంత్రం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు